Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైడ్రాక్సీ క్లోరోక్విన్ చాలా డేంజరస్?

Webdunia
శనివారం, 25 ఏప్రియల్ 2020 (12:32 IST)
కరోనా వైరస్ నేపథ్యంలో హైడ్రాక్సీ క్లోరోక్విన్ డ్రగ్ కు ప్రపంచ వ్యాప్తంగా ఫుల్ డిమాండ్ ఏర్పడిన సంగతి తెలిసిందే. మలేరియాకు ఉపయోగించే ఈ ఔషధం కరోనా చికిత్సలో మంచి ఫలితాలను ఇస్తుందనే అంచనాలతో దీనికి డిమాండ్ ఏర్పడింది.

అయితే, హైడ్రాక్సీ క్లోరోక్విన్ ప్రమాదకారి అని... దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డీఏ) హెచ్చరించింది. దీని వల్ల గుండె సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని తెలిపింది.

ఈ ఔషధానికి సంబంధించిన వివరాల్లో ముందుగానే వీటిని పొందుపరిచారని చెప్పింది. ఈ సైడ్ ఎఫెక్ట్ ని దృష్టిలో పెట్టుకుని చికిత్స అందించాలని సూచించింది. కరోనా బాధితుడి పరిస్థితిని బట్టి ఏ ఔషధం వాడాలనే విషయాన్ని అక్కడున్న వైద్య సిబ్బంది జాగ్రత్తగా నిర్ణయించాలని తెలిపింది.

కరోనాపై సమర్థవంతంగా పోరాడే ఔషధాల కోసం ఇంకా ప్రయోగాలు జరుగుతున్నాయని ఎఫ్డీఏ చెప్పింది. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే హైడ్రాక్సీ క్లోరోక్విన్ ను వాడేందుకు అనుమతులు ఇచ్చామని తెలిపింది. ఈ డ్రగ్ వాడకానికి సంబంధించి పూర్తి వివరాలను వైద్యులకు అందుబాటులో ఉంచాలని సూచించింది. 

మరోవైపు, ఈ ఔషధ నిల్వలు భారత్ వద్ద ఎక్కవగా ఉండటంతో... ఎన్నో దేశాలు వీటిని సరఫరా చేయాల్సిందిగా మన దేశాన్ని కోరాయి. సాయం కోరిన అన్ని దేశాలకు భారత్ ఈ డ్రగ్ ను సరఫరా చేసింది. తద్వారా ప్రపంచ దేశాలకు స్నేహ హస్తాన్ని అందించింది.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments