Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్రామ‌స్థాయిలో ఆక్వా ఉత్ప‌త్తుల విక్ర‌యాలు జ‌ర‌పాలి: జగన్‌

Webdunia
శనివారం, 25 ఏప్రియల్ 2020 (12:28 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జనతా బజార్ల విధివిధానాలపై సీఎం వైయస్ జగన్‌ సమీక్ష నిర్వ‌హించారు. జనతా బజార్ల నిర్వహణ, విధివిధానాలపై సమీక్షలో అధికారుల ప్రతిపాదనలపై చర్చను విడిది కార్యాల‌యంలో నిర్వ‌హించారు.

జనతా బజార్లలో ఆక్వా ఉత్పత్తులను విక్రయించేలా చూడాల‌ని ఈ సంద‌ర్భంగా సీఎం ఆదేశించారు. గ్రేడింగ్, ప్యాకింగ్‌ దశ కూడా గ్రామస్థాయిలోకి తీసుకెళ్లాలి. రైతుల వ్యవసాయ ఉత్పత్తులకు తగిన స్థాయిలో మార్కెట్‌ ఈ బజార్ల ద్వారా మార్కెటింగ్‌ అవకాశాలు లభించాలి. కరోనా నేపథ్యంలో వికేంద్రీకరించిన బజార్లను భవిష్యత్తులోనూ కొనసాగేలా చూడాలి.

రైతుల నుంచి కొనుగోలు చేసిన ఉత్పత్తులను ఇక్కడ విక్రయించేలా చూడాలి. దీనివల్ల రైతులకు, వినియోగదారులకు మేలు జరుగుతుంది. దీనివల్ల మార్కెట్‌లో పోటీ కూడా పెరుగుతుందని, తద్వారా రైతులకు మేలు జరుగుతుందన్న సీఎం మార్కెట్లో ఉత్పత్తులు నిలవాలంటే.. గ్రేడింగ్, ప్యాకింగ్‌ బాగుండాలి అని సూచించారు.

కనీసం 20–25 ఉత్పత్తులు అందేలా చూడాలి. సమావేశంలో చర్చించిన అంశాలతో విధివిధానాలు తయారుచేయాలని సీఎం ఆదేశం. మరింత మేథోమథనం చేసి మంచి ప్రతిపాదనలతో రావాలని సీఎం కోరారు. కార్య‌క్ర‌మంలో వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు, అగ్రికల్చర్‌ మిషన్‌  వైస్‌ ఛైర్మన్‌ నాగిరెడ్డి, ప‌లువురు ఉన్న‌తాధికారులు హాజరయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

ప్రశాంత్ వర్మ చిత్రం మహాకాళి లోకి అడుగుపెట్టిన అక్షయ్ ఖన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments