Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్ రాజకీయాల్లోకి హఫీజ్: లాహోర్‌లో పార్టీ కార్యాలయం ప్రారంభం

పాకిస్థాన్‌ రాజకీయాల్లోకి ఉగ్రవాదం కాలుమోపనుందనే ఆందోళన మొదలైంది. కరుడుగట్టిన ఉగ్రవాది, ముంబై బాంబు పేలుళ్ల సూత్రధారి, జమాత్ ఉద్దవా అధినేత హఫీజ్ సయీద్ లాహోర్‌లో పార్టీ కార్యాలయాన్ని మొదలెట్టడం.. ప్రపం

Webdunia
సోమవారం, 25 డిశెంబరు 2017 (15:57 IST)
పాకిస్థాన్‌ రాజకీయాల్లోకి ఉగ్రవాదం కాలుమోపనుందనే ఆందోళన మొదలైంది. కరుడుగట్టిన ఉగ్రవాది, ముంబై బాంబు పేలుళ్ల సూత్రధారి, జమాత్ ఉద్దవా అధినేత హఫీజ్ సయీద్ లాహోర్‌లో పార్టీ కార్యాలయాన్ని మొదలెట్టడం.. ప్రపంచ దేశాలకు మింగుడుపడటం లేదు. ముంబై పేలుళ్ల సూత్రధారి హఫీజ్‌ను ఉగ్రవాద వ్యతిరేక చట్టం కింద జనవరి 31న పాక్ ప్రభుత్వం గృహ నిర్బంధం చేసిన సంగతి తెలిసిందే. గత నెల 24న కోర్టు ఆదేశాలతో ఆయన విడుదలయ్యాడు
 
ఆపై హఫీజ్ కాశ్మీర్‌ను భారత్ నుంచి వేరు చేస్తానని అతడు ప్రకటించాడు. హఫీజ్‌కు పాకిస్థాన్ మాజీ నియంత ముషారఫ్ కూడా తోడయ్యారు. ముషారఫ్‌తో పాటు పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ కూడా హఫీజ్‌కు మద్దతిచ్చారు. ఈ నేపథ్యంలో హఫీజ్ రాజకీయ పార్టీని ప్రకటించాడు. తాజాగా పార్టీ కార్యాలయాన్ని కూడా ఆరంభించాడు. పాక్ ప్రభుత్వం హెచ్చరిస్తున్నా పట్టించుకోని హఫీజ్, మిల్లి ముస్లిం లీగ్ (ఎంఎంఎల్) పార్టీ కార్యాలయాన్ని ఆదివారం ప్రారంభించాడు. 2018 సాధారణ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించాడు. 
 
కాగా సయీద్ రాజకీయాల్లోకి వస్తే తీవ్ర పరిణామాలు తప్పవని అమెరికా ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేసింది. అతని నేర చరిత్రను దృష్టిలో వుంచుకుని అతనిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది. మరోవైపు ఎంఎంఎల్‌ను పార్టీగా పరిగణనలోకి తీసుకోరాదంటూ ఎన్నికల సంఘాన్ని పాకిస్థాన్ ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments