Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నయనతార పేరు చెప్పగానే చొంగ కార్చుకుంటూ వచ్చాడు... వలలో పడ్డాడు...

సినిమా హీరోయిన్లు పేర్లు చెప్పినా, వారి ఫోటోలను చూసినా చాలామంది మహా ఇష్టాన్ని ప్రదర్శిస్తుంటారు. అదే ఓ హీరోయిన్ తను ఫలానా చోట వున్నానని చెబితే, ఆ పిలుపు అందుకున్న వ్యక్తి మామూలుగా వుండగలుగుతాడా? నో చాన్స్. అదే జరిగింది. వివరాల్లోకి వెళితే... బీహార్ ర

Advertiesment
Bihar Crime
, శనివారం, 23 డిశెంబరు 2017 (14:57 IST)
సినిమా హీరోయిన్లు పేర్లు చెప్పినా, వారి ఫోటోలను చూసినా చాలామంది మహా ఇష్టాన్ని ప్రదర్శిస్తుంటారు. అదే ఓ హీరోయిన్ తను ఫలానా చోట వున్నానని చెబితే, ఆ పిలుపు అందుకున్న వ్యక్తి మామూలుగా వుండగలుగుతాడా? నో చాన్స్. అదే జరిగింది. వివరాల్లోకి వెళితే... బీహార్ రాష్ట్రంలో భాజపా మంత్రి మొబైల్ ఫోన్ తస్కరించబడింది. తన ఫోన్ పోవడంతో మంత్రిగారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
ఫోన్ ట్రాక్ చేసి చూడగా అది ఓ గ్యాంగస్టర్ దగ్గర వున్నదని తేలింది. తొలుత ఫోన్ కోసం అతడికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయకుండా స్విచాఫ్ చేయడం మొదలుపెట్టాడు. దీంతో అతడి నుంచి ఎలాగైనా ఫోన్ తీసుకోవడమే కాకుండా, అతడిని అరెస్టు చేసేందుకు మహిళా పోలీసు అధికారి పక్కా వ్యూహరచన చేశారు. 
 
తొలుత ఆ ఫోన్ నెంబరుకి తను సినీ నటి నయనతార అనీ, మిమ్మల్ని కలవాలనుకుంటున్నట్లు సందేశం పంపారు. ఐతే ఆ సందేశాన్ని నమ్మని సదురు గ్యాంగస్టర్ ఫోటోను పంపాల్సిందిగా కోరాడు. నయనతార లేటెస్ట్ ఫోటో... అంటే నెట్లో ఎక్కడా ఇంతవరకూ లేని ఫోటోను అతడికి పంపారు. దాంతో గ్యాంగస్టర్ వెంటనే మిమ్మల్ని కలిసేందుకు ఎక్కడకి రావాలి అని సందేశం పంపాడు. ఫలానా చోటికి రమ్మంటూ మహిళా పోలీసు అధికారిణి మెసేజ్ పెట్టారు. అంతే... గ్యాంగస్టర్ చొంగ కార్చుకుంటూ సందేశంలో చూపిన ప్రదేశానికి రెండో ఆలోచన చేయకుండా వచ్చేశాడు. అలా వచ్చీరాగానే అతడిని పోలీసు బలగాలు చుట్టుముట్టేసాయి. అలా గ్యాంగస్టర్ పోలీసుల ఉచ్చులో ఇరుక్కుపోయాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జియో కస్టమర్లకు ముందుగానే హ్యాపీ న్యూ ఇయర్... న్యూ ప్లాన్స్....