Webdunia - Bharat's app for daily news and videos

Install App

దినకరన్ అబద్ధాల పుట్ట.. అతనో 420: ఓపీఎస్ మండిపాటు

తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం శశికళ మేనల్లుడు, ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో జయకేతనం ఎగురవేసిన టీటీవీ దినకరన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. టీటీవీ దినకరన్ నోరు తెరిస్తే అసత్యాలు పలకడం తప్ప ఇంకే

Webdunia
సోమవారం, 25 డిశెంబరు 2017 (14:46 IST)
తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం శశికళ మేనల్లుడు, ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో జయకేతనం ఎగురవేసిన టీటీవీ దినకరన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. టీటీవీ దినకరన్ నోరు తెరిస్తే అసత్యాలు పలకడం తప్ప ఇంకేమీ తెలియదన్నారు. అతనొక 420 అని విషయాన్ని తన వద్ద స్వయంగా చెప్పారని ఓపీఎస్ అన్నారు.

ఆర్కే నగర్ ఉప ఎన్నికలో దినకరన్ 40 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అన్నాడీఎంకేపై దినకరన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మూడు నెలల్లో ప్రభుత్వం కూలిపోతుందని చెప్పారు. దీనిపై ఓపీఎస్- ఈపీఎస్ వర్గం సీరియస్ అయ్యింది. 
 
ఓపీఎస్ దినకరన్‌పై మాట్లాడుతూ.. దినకరన్ అబద్ధాల పుట్ట అనేందుకు ఓ ఉదాహరణ కూడా చెప్పారు. ఓపిఎస్‌ను తానే అమ్మకు పరిచయం చేశానని దినకరన్ అన్నారు. అయితే దినకరన్ కంటే 18 సంవత్సరాల ముందే తాను పార్టీలో పలు బాధ్యతలు చేపట్టానని ఓపీఎస్ వివరించారు. దినకరన్ అసత్యాలు పలికే వ్యక్తి అనేందుకు ఇంతకంటే నిజం ఏం కావాలన్నారు. 
 
రామాయణంలో మాయ లేడిలా దినకరన్ అని.. మాయ లేడి వల్ల ఏర్పడిన పరిణామాలేంటో అందరికీ తెలుసునని.. అలాంటి మాయాజాలంతో టీటీవీ ఆర్కేనగర్‌లో గెలిచాడని ఓపీఎస్ విమర్శించారు. ఏది ఏమైనా.. అమ్మ బాటలో నడుస్తూ ఆర్కే నగర్‌తో పాటు రాష్ట్ర ప్రజలందరికీ సంక్షేమ పథకాలను అందజేస్తామని ఓపీఎస్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments