Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భారత్‌ నుంచి కాశ్మీర్‌ను వేరు చేయడమే లక్ష్యం: హఫీజ్ సయీద్

ముంబై పేలుళ్ల ప్రధాన సూత్రధారి హఫీజ్ సయీద్ మరోసారి భారత్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. భారత్ నుంచి కాశ్మీర్‌ను వేరు చేయడమే తన జీవిత లక్ష్యమని స్పష్టం చేశాడు. బంగ్లాదేశ్‌‌ను పాకిస్థాన్ నుంచి వేరు చేస

భారత్‌ నుంచి కాశ్మీర్‌ను వేరు చేయడమే లక్ష్యం: హఫీజ్ సయీద్
, ఆదివారం, 17 డిశెంబరు 2017 (11:12 IST)
ముంబై పేలుళ్ల ప్రధాన సూత్రధారి హఫీజ్ సయీద్ మరోసారి భారత్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. భారత్ నుంచి కాశ్మీర్‌ను వేరు చేయడమే తన జీవిత లక్ష్యమని స్పష్టం చేశాడు. బంగ్లాదేశ్‌‌ను పాకిస్థాన్ నుంచి వేరు చేసినట్టే.. భారత్ నుంచి కాశ్మీర్‌‌ను వేరు చేయాలని సయీద్ అన్నాడు. తద్వారా 1971 యుద్ధానికి ప్రతీకారం తీర్చుకుంటామని హఫీజ్ సయీద్ తెలిపాడు. 
 
పాకిస్థాన్ నుంచి బంగ్లాదేశ్‌ విమోచన యుద్ధంపై ప్రతి పాకిస్థానీ పగతో రగిలిపోతున్నాడని హఫీజ్ అన్నాడు. డిసెంబర్ 16ను భారత్-బంగ్లాదేశ్‌లు విజయ్ దివస్‌గా జరుపుకోవడంపై సయీద్ మండిపడ్డాడు.
 
ఇదిలా ఉంటే.. ముంబయి పేలుళ్ల ప్రధాన సూత్రధారి, లష్కరే-ఈ-తోయిబా ఉగ్రవాద సంస్థ జేయూడీ చీఫ్‌ హఫీజ్‌ సయీద్‌ పాకిస్థాన్‌ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. 2018 సాధారణ ఎన్నికల్లో ఎంఎంఎల్ ‌(మిలి ముస్లిం లీగ్‌) పార్టీ తరఫున పోటీ చేయనున్నట్లు ప్రకటించాడు. ఈ ఏడాది నవంబర్‌ 24న హఫీజ్‌ గృహనిర్బంధం నుంచి విడుదలైయ్యాడు. 
 
ఇప్పటికే హఫీజ్‌ విడుదల కావడంపై అమెరికా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అతడు చేసిన నేరాలను పరిగణలోకి తీసుకుని మళ్లీ అరెస్ట్‌ చేయాలని పాక్‌కు సూచించింది. అయితే హఫీజ్‌ను అరెస్ట్ చేయడంలో పాకిస్థాన్ సర్కారు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. సయ్యీద్ మాత్రం కాశ్మీర్‌ను భారత్‌ నుంచి వేరు చేస్తానని ప్రకటించాడు. అంతేగాకుండా.. హఫీజ్‌ అంటే తనకు ఎంతో ఇష్టమని పాకిస్థాన్ మాజీ నియంత, అధ్యక్షుడు ముషారఫ్ ప్రకటించారు. వీరిద్దరూ ఏకమై ఎన్నికల్లోకి వెళ్తే తీవ్ర పరిణామాలుంటాయని అమెరికా హెచ్చరించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైకాపా ఎమ్మెల్యే అనిల్ కుమార్‌ ఓ రౌడీ.. కిరణ్ రాయల్