Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాస్‌ఏంజెల్స్‌లో కాల్పుల మోత - నలుగురి మృతి

Webdunia
సోమవారం, 24 జనవరి 2022 (09:10 IST)
అగ్రరాజ్యం అమెరికా మరోమారు కాల్పుల మోతతో దద్ధరిల్లిపోయింది. ఈ దేశంలోని లాస్ ఏంజెల్స్‌లో దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో నలుగురు ప్రాణాలు కోల్పయారు. మరొకరు తీవ్రంగా గాయపడి ప్రాణాపాయస్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 
 
లాస్ ఏంజెల్స్‌కు సమీపంలోని ఇంగ్లెవుడ్‌లోని ఓ ఇంట్లో జరుగుతున్న పార్టీని లక్ష్యంగా చేసుకుని దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఆదివారం అర్థరాత్రి 1.30 గంటల సమయంలో ఆ ఇంటిపై కొందరు గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయినట్టు ఇంగ్లెవుడ్ మేయర్ జైమ్స్ బట్స్ వెల్లడించారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. 
 
కాగా, 1990 తర్వాత ఇంగ్లెవుడ్‌లో జరిగిన అతిపెద్ద కాల్పుల ఘటన ఇదేనని ఆయన గుర్తుచేశారు. లాస్ ఏంజెల్స్‌ నగరం హాలీవుడ్‌కు నిలయంగా ఖ్యాతిగడించిన విషయం తెల్సిందే. ఈ నగరానికి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇంగ్లెవుడ్‌లో దుండగులు తుపాకీలతో రెచ్చిపోయి మారణహోం సృష్టించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమ్ముడితో సెటిల్ చేస్తా.. మరి నాకేంటి అని అన్నయ్య అడిగారు? శ్రీసుధ

హృదయాలను హత్తుకునేలా గాంధీ తాత చెట్టు - రివ్యూ

నాకు వేల కోట్ల క్లబ్ వద్దు - దేవుడిచ్చింది చాలు : వెంకటేష్

తిరుపతిలో సెటిల్ అవుతా, గోవిందా... గోవిందా నామస్మరణతో నిద్రలేస్తా: జాన్వీ కపూర్

సంక్రాంతికి వస్తున్నాం.. జబర్దస్త్ స్కిట్టా? దర్శకుడు అనిల్ ఏమంటున్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ తాగితే ఈ సమస్యలన్నీ పరార్

Winter Water: శీతాకాలం.. నీళ్లు తాగుతున్నారా..? పిల్లలకు వేడి నీళ్లు తాగిస్తే..?

శీతాకాలంలో జీడిపప్పును ఎందుకు తినాలి?

కోడికూర (చికెన్‌)లో ఈ భాగాలు తినకూడదు.. ఎందుకో తెలుసా?

జీవనశైలిలో మార్పులతో గుండెజబ్బులకు దూరం!!

తర్వాతి కథనం
Show comments