పాకిస్థాన్ దేశంలోని ప్రముఖ నగరమైన లాహోర్‌లోని అనార్కలి మార్కెట్ పాన్ మండి వద్ద గురువారం రాత్రి భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా మరో 20 మంది వరకు గాయపడినట్టు పాకిస్థాన్ మీడియా వెల్లడించింది. అయితే, ఈ ప్రమాదంపై పూర్తి సమాచారం రావాల్సివుంది.
ఈ ప్రమాదంలో లాహోర్ పోలీసులు మీడియాతో మాట్లాడుతూ, ప్రమాదం జరిగిన ప్రాంతం ఎక్కువగా భారతీయ వ్యాపారులు వ్యాపారం చేసుకునే ఏరియా అని, అందుకే ఈ పేలుడుపై అనేక అనుమానాలకు తావిస్తుందని తెలిపారు. ఇప్పటివరకు ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్టు చెప్పారు.
నిత్యం రద్దీగా ఉండే మార్కెట్‌ను చేసుకుని దుండగులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని చెప్పారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించి, ఘటనా ప్రాంతంలో సాక్ష్యాధారాలను సేకరిస్తున్నట్టు చెప్పారు.
ఇదిలావుంటే, ఈ పేలుడు ఇప్పటివరకు ఏ ఒక్క ఉగ్రవాద సంస్థ నైతిక బాధ్యత వహించలేదు. అయితే, పోలీసులు జరిపిన ప్రాథమిక దర్యాప్తులో మాత్రం ఈ పేలుడు బైకులో అమర్చిన పేలుడు పదార్థాల వల్ల జరిగినట్టు గుర్తించారు.