Webdunia - Bharat's app for daily news and videos

Install App

సింగపూర్‌లో బాలికకు బలవంతంగా ముద్దు, భారత యువకుడికి ఏడు నెలలు జైలు శిక్ష

Webdunia
బుధవారం, 21 అక్టోబరు 2020 (22:10 IST)
భారతదేశంలో ప్రేమ పేరుతో ముద్దులాడటం సహజంగా మారిపోయింది. కానీ విదేశాలలో ఇది చట్టపరంగా నేరం. సింగపూర్‌లో ఓ బాలికను బలవంతంగా ముద్దు పెట్టుకున్న భారతీయ యువకుడికి ఏడు నెలలు జైలు శిక్ష విధించారు. భద్రతా సమన్వయకర్తగా పనిచేసే చెల్లం రాజేశ్ కన్నన్(26)కు భార్య కుమార్తె ఉన్నారు.
 
సోషల్ మీడియా ద్వారా గత ఏడాది ఓ బాలిక (15) పరిచయమైంది. అది క్రమంగా మెసేజ్‌లు పంపుకునేంతవరకు వెళ్లగా, గతేడాది ఆగస్టులో ఇద్దరూ తొలిసారి కలుసుకున్నారు. ఆ తర్వాత మరోమారు కలవడానికి కూడా ఆ బాలిక అంగీకరించింది. దీంతో తమ స్నేహితులకు మద్యం తీసుకురావాలని ఆ బాలిక రాజేశ్‌ను కోరింది.
 
దీనికి బదులుగా రాజేశ్ అలా తీసుకొని వస్తే తనకు ముద్దు ఇవ్వాలని కోరాడు. అందుకు బాలిక తిరస్కరించింది. అయినా రాజేశ్ బలవంతంగా ముద్దు పెట్డాడు. దీంతో బాలిక అతనిపై కేసు పెట్టింది. కేసును విచారించిన కోర్టు అతనికి ఏడు నెలలు జైలు శిక్ష విధించింది. తాను చేసిన పొరపాటు వల్ల చివరికి ఉద్యోగం పోవడమే గాక తన కుటుంబానికి కూడా దూరమయ్యానని రాజేశ్ ఆవేదన వ్యక్తం చేశాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అల్లు అర్జున్‌ను పవన్ కళ్యాణ్ కలిశాడా? ఏపీ డిప్యూటీ సీఎం ఎందుకు మౌనంగా వున్నాడు?

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ కంటెంట్ చాలా కొత్తగా వుంది. డైరెక్టర్ బాబీ కొల్లి

హీరో సిద్ధార్థ్ పాడిన 'నా శ్వాసే నువ్వై..' లిరికల్ సాంగ్ రిలీజ్

దిల్ రూబా షూటింగ్ కంప్లీట్, ఫిబ్రవరిలో రిలీజ్ కు రెడీ

కొన్ని రోజులు థియేటర్స్ లో వర్క్ చేశా, అక్కడే బీజం పడింది : హీరో ధర్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments