Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుబాయ్‌లో 16 ఏళ్ల బాలుడిపై కీచక పర్వం.. విల్లాకు తీసుకెళ్లి ఐదుగురి అత్యాచారం..

Webdunia
శనివారం, 27 జులై 2019 (15:12 IST)
దుబాయ్‌లో దారుణం చోటుచేసుకుంది. 16ఏళ్ల బాలుడిపై ఐదుగురు పురుషులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కీచక పర్వం సంచలనం సృష్టించింది. ఐదుగురు పురుషులు ఓ విల్లాకు 16 ఏళ్ల బాలుడిని తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 19 వుంచి 25 ఏళ్ల వయస్సున్న ఐదుగురు నిందితులను పోలీసులు కోర్టు ముందు హాజరుపరిచారు. 
 
ఈ కేసు విచారణలో భాగంగా.. 16ఏళ్ల బాలుడిని కారులో ఎక్కించుకుని విల్లాకు తీసుకెళ్లారని.. ఏప్రిల్ 18వ తేదీన ఆ బాలుడిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని న్యాయవాదులు ఆరోపించారు. ఈ ఘటన అల్ ఖుసైన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. స్నాప్ చాట్ ద్వారా స్నేహితుడైన ఓ వ్యక్తి కలవమని పిలవడంతో వెళ్లానని బాధితుడు వాపోయాడు. 
 
అలా వెళ్ళిన తనను స్నాప్ చాట్ ద్వారా పరిచయమైన వ్యక్తి స్నేహితుడిని పంపి తనకు తీసుకెళ్లాడని చెప్పాడు. అక్కడ నుంచి ఐదుగురు తనను విల్లాకు తీసుకెళ్లారని.. అక్కడ ఓ గదలో నిర్భంధించి అత్యాచారానికి పాల్పడ్డారని తెలిపాడు. 
 
కత్తులతో బెదిరించి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని.. మరుసటి రోజు ఇంటికి తిరిగి పంపారని బాధితుడు చెప్పాడు. ఈ తతంగాన్ని వీడియో తీసి బెదిరించారని.. కానీ ఇంటికొచ్చిన ఆ యువకుడు ఈ విషయాన్ని తల్లిదండ్రుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బాగోతం బయటపడింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆది సాయికుమార్‌ డివోష‌న‌ల్ సస్పెన్స్‌ థ్రిల్ల‌ర్ షణ్ముఖ

రాఘవేంద్రరావు ఆవిష్కరించిన 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో ట్రైలర్

Akhanda 2: అఖండ 2: తాండవం కోసం హిమాలయాల్లో బోయపాటి శ్రీను సర్వే

Dulquer salman: లక్కీ భాస్కర్‌ కోసం ముగ్గురు అగ్ర నిర్మాతలు అండ దండ

Rambha: సీనియర్ నటి రంభ వెండితెర పునరాగమనానికి సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

మహిళలు అల్లంతో కూడిన మజ్జిగ తాగితే.. నడుము చుట్టూ ఉన్న కొవ్వు?

తర్వాతి కథనం