Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోగి మెదడులో న్యూరాలింక్ చిప్ అమర్చి వైద్యులు.. ఎక్కడ?

వరుణ్
మంగళవారం, 30 జనవరి 2024 (10:48 IST)
మనిషి మెదడు.. కంప్యూటర్‌ల మధ్య కమ్యూనికేషన్ వ్యవస్థను ఏర్పరచడమే లక్ష్యంగా టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సహ వ్యవస్థాపకుడిగా 2016లో స్థాపించిన న్యూరోటెక్నాలజీ కంపెనీ 'న్యూరాలింక్' కీలకమైన ప్రయోగాన్ని చేపట్టింది. మొట్టమొదటిసారిగా ఒక పేషెంట్ మెదడులో న్యూరాలింక్ చిప్‌ను అమర్చింది. 
 
ఈ ప్రయోగం ఆశాజనక ఫలితాలను కూడా అందిస్తోంది. ఈ విషయాన్ని ఎలాన్ మస్క్ తన ట్విట్టర్ ఖాతా (ఎక్స్) వేదికగా స్వయంగా వెల్లడించారు. 'నిన్న మొదటిసారి మనిషి మెదడులో న్యూరాలింక్‌ను అమర్చారు. పేషెంట్ కోలుకుంటున్నాడు. ప్రారంభ ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయి. నాడీ కణాలను గుర్తించడం ఖచ్చితంగా కనిపిస్తోంది' అని ఎలాన్ మస్క్ పేర్కొన్నారు.
 
మనిషి సామర్ధ్యాలను ఉత్తేజం చేయడం, పార్కిన్సన్స్ వంటి నాడీ సంబంధిత వ్యాధులకు చికిత్స ప్రధాన లక్ష్యాలుగా ఈ ప్రయోగం కొనసాగుతోంది. మనుషులు, కృత్రిమ మేధస్సు మధ్య సహజీవన సంబంధాన్ని సాధించడం కూడా ఒక ఆశయంగా ఉందని గతంలో కంపెనీ పేర్కొంది. మనిషి మెదడులో చిప్‌ను అమర్చేందుకు అమెరికా నియంత్రణ సంస్థ నుంచి గతేడాది అనుమతి లభించడంతో ఈ ప్రయోగం చేపట్టారు.
 
ఐదు నాణేల పరిమాణంలో ఉండే చిప్‌ను సర్జరీ ద్వారా మనిషి మెదడులో అమర్చుతారు. 'లింక్' సాంకేతికత ప్రధానంగా ఈ చిప్ పనిచేస్తుంది. కాగా కాలిఫోర్నియా కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న 'న్యూరాలింక్' కంపెనీలో 400 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రయోగాల కోసం కంపెనీ ఇప్పటికే 363 మిలియన్ డాలర్ల నిధులు సేకరించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం