Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దర్శకుడు కూచిపూడి వెంకట్ రొమాన్స్ విత్ రైస్ పేరుతో చిట్టిముత్యాలుకు శ్రీకారం

director venkat- dilraju and others
, శుక్రవారం, 17 నవంబరు 2023 (20:01 IST)
director venkat- dilraju and others
దర్శకుడు కూచిపూడి వెంకట్ రొమాన్స్ విత్ రైస్ పేరుతో చిట్టిముత్యాలుకు శ్రీకారం చుట్టారు. ఫుడ్ ఇండస్ట్రీలో అనేక విప్లవాలు అలవోకగా ఆవిష్కరిస్తున్న "వంటల మాంత్రికుడు" కూచిపూడి వెంకట్ కిచెన్ కిరీటంలో మరో కలికితురాయి చేరింది. "ఉలవచారు, రాజుగారి తోట, కూచిపూడి పలావ్, రాజుగారి కోడి పలావ్, మారేడుమిల్లి" వంటి అద్భుత విజయాలతో ఫుడ్ ఇండస్ట్రీలో "సూపర్ స్టార్"గా వెలుగొందుతున్న కూచిపూడి వెంకట్ తాజాగా "చిట్టిముత్యాలు" పేరుతో మరో రెస్టారెంట్ కు శ్రీకారం చుట్టారు.
 
 స్వతహాగా ఆయన దర్శకుడు కావడంతో దీనికి "రొమాన్స్ విత్ రైస్" అనే ట్యాగ్ లైన్ పెట్టారు. హైదరాబాద్, హైటెక్ సిటీ సమీపంలో... మాదాపూర్, అయ్యప్ప సొసైటీలోని ఇమేజ్ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన "చిట్టిముత్యాలు" (రొమాన్స్ విత్ రైస్) రెస్టారెంట్ ను ప్రఖ్యాత నిర్మాతలు దిల్ రాజు, టిజి విశ్వప్రసాద్... సంచలన దర్శకులు హరీష్ శంకర్, అనిల్ రావిపూడి ప్రారంభించారు. దిల్ రాజు, రెస్టారెంట్ రిబ్బన్ కట్ చేయగా, హరీష్ శంకర్ జ్యోతి ప్రజ్వలన చేశారు. అనిల్ రావిపూడి "మెను" లాంచ్ చేయగా, విశ్వప్రసాద్ క్యాష్ కౌంటర్ ఓపెన్ చేశారు!!
 
"ఇంతటి అత్యద్భత ఆహ్లాదకర వాతావరణం సృష్టించి, ఎంత తిన్నా తనివి తీరని నోరూరించే వంటకాలతో భోజనప్రియుల మనసులు దోచుకోవడం కూచిపూడి వెంకట్ కు మాత్రమే సాధ్యమని దిల్ రాజు, అనిల్ రావిపూడి పేర్కొన్నారు. "చిట్టిముత్యాలు" హైదరాబాద్ ఫుడ్ ఇండస్ట్రీలో ఓ మణిహారంలా భాసిల్లడం ఖాయమని టి.జి.విశ్వప్రసాద్, హరీష్ శంకర్ ప్రశంసించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో రెస్టారెంట్స్ ఏర్పాటు చేయడం తనకు ప్యాషన్ అని ప్రకటించిన కూచిపూడి వెంకట్... "చిట్టిముత్యాలు"తో ఒక గొప్ప భోజనానుభూతిని పంచేందుకు చాలా నెలలు శ్రమించామని తెలిపారు. తన ఆహ్వానాన్ని మన్నించి తమ చేతుల మీదుగా "చిట్టిముత్యాలు" ప్రారంభించిన "దిల్ రాజు, టీజీ విశ్వప్రసాద్, హరీష్ శంకర్, అనిల్ రావిపూడి"లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ వేడుకను సౌత్ ఇండియా నంబర్ 1 ఈవెంట్ ఆర్గనైజర్ "శ్రేయాస్ శ్రీనివాస్" తనదైన శైలిలో నిర్వహించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఖైది గా జ‌యం ర‌వి, పోలీస్ ఇన్‌స్పెక్ట‌ర్ గా కీర్తి సురేష్ నటించిన సైర‌న్‌ రాబోతుంది