Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని మోడీ మళ్లీ గెలిస్తే దేశంలో నియంత పాలనే : మల్లికార్జున ఖర్గే

వరుణ్
మంగళవారం, 30 జనవరి 2024 (10:30 IST)
త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ ప్రధాని నరేంద్ర మోడీ అధికారంలోకి వస్తే దేశంలో నియంత పాలన సాగుతుందని, దేశానికి ఇచే చివరి ఎన్నికలు అవుతాయని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే జోస్యం చెప్పారు. ఆయన ఒరిస్సా రాష్ట్రంలోని భువనేశ్వర్‌లో కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల తర్వాత బీజేపీ గెలిస్తే దేశంలో నియంతృత్వ పాలన వస్తుందని హెచ్చరించారు. 
 
అప్పుడు దేశంలో ఇవే చివరి ఎన్నికలు అవుతాయన్నారు. నరేంద్ర మోడీని ఓడిస్తేనే దేశంలో ప్రజాస్వామ్యం మనుగడ సాగించగలదన్నారు. మోడీ మళ్లీ గెలిస్తే దేశ ప్రజలు వేసే చివరి ఓటు 2024 సార్వత్రిక ఎన్నికలే అవుతాయని హెచ్చరించారు. ప్రతి ఒక్కరికీ నోటీసులు ఇస్తున్నారని... ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఆ భయం వల్లే కొంతమంది I.N.D.I.A. కూటమి నుంచి... మరికొందరు పార్టీ నుంచి వెళుతున్నారని వ్యాఖ్యానించారు. 
 
'ఇదే మీకు చివరి అవకాశం.. ఓటు వేయండి... దీని తర్వాత మోడీ గెలిస్తే ఓటింగ్ ఉండదు' అని వ్యాఖ్యానించారు. బీజేపీని, ఆ పార్టీ సైద్ధాంతిక సంస్థ ఆర్ఎస్ఎస్‌ను ఓ విషపు పురుగా ఖర్గే పేర్కొన్నారు. రాహుల్ గాంధీ దేశాన్ని ఏకం చేయాలనుకుంటున్నారని... తాను 'మొహబ్బత్ కీ దుకాన్'ను ప్రారంభించానని చెప్పారని గుర్తు చేశారు. కానీ బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లు  'నఫ్రత్కీ దుకాన్'కు తెరదీశారని ఆరోపించారు. ఈ కారణంగా మీరు అప్రమత్తంగా ఉండాలని కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments