Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికా వద్ద డబ్బుల్లేవ్... స్పీకర్ ఫారిన్ టూర్ రద్దు.. ట్రంప్ నిర్ణయం

Webdunia
శుక్రవారం, 18 జనవరి 2019 (11:53 IST)
అమెరికా వద్ద డబ్బులు లేవట. ఈ విషయాన్ని ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్వయంగా వెల్లడించారు. అందుకే అమెరికా పార్లమెంట్ స్పీకర్ నాన్సీ పెలోసీ చేపట్టిన విదేశీ పర్యటనను ట్రంప్ రద్దు చేశారు. 
 
మెక్సికో సరిహద్దుల్లో గోడను నిర్మించేందుకు అమెరికా అధ్యక్షుడు మొండిపట్టుపట్టారు. కానీ, ఈ గోడ నిర్మాణానికి నిధులు మంజూరు చేసేందుకు హౌస్ ససేమిరా అంటోంది. దీంతో అమెరికాలో ఆర్థిక సంక్షోభం మొదలైంది. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం వైట్‌హౌస్‌లో కిచన్ మూసివేత, ఆపై ట్రంప్ పిజ్జాలు, బర్గర్లను బయటి నుంచి ఆర్డర్ చేసి రప్పించారన్న వార్తపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరిగింది. 
 
ఇక తాజాగా హౌస్ స్పీరక్ నాన్సీ పెలోసీ, అఫ్గనిస్థాన్‌లో తలపెట్టిన పర్యటనను రద్దు చేస్తున్నట్టు ట్రంప్ ఉత్తర్వులు వెలువరించారు. దీంతో ఆమె ప్రయాణాన్ని రద్దు చేస్తున్నట్టు వైట్ హౌస్ ప్రకటించింది. 
 
ఇందుకోసం వైట్‌హౌస్ జారీ చేసిన ఉత్తర్వుల్లో 'మీరు ఈ సమయంలో వాషింగ్టన్‌లోనే ఉండి, నాతో, సహచర సభ్యులతో చర్చించాలని నేను కోరుకుంటున్నాను. ఈ షట్‌డౌన్‌ను ఇంతటితో ముగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీ ప్రయాణానికి అవసరమైన నిధులను కల్పించే పరిస్థితి లేదు. షట్‌డౌన్ ముగిసిన తర్వాత మీ ప్రయాణాన్ని పెట్టుకోవచ్చు' అని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sathya: భకాసుర టైటిల్‌ ర్యాప్‌ సాంగ్‌ను ఆవిష్కరించిన అనిల్ రావిపూడి

సుహాస్‌, మాళవిక మనోజ్ నటించిన ఓ భామ అయ్యో రామ ట్రైలర్‌

Varun Tej: వరుణ్ తేజ్ 15 వ చిత్రం విదేశాల్లో షూటింగ్

Kartik Aaryan- Sreeleela: కార్తీక్ ఆర్యన్‌తో శ్రీలీల ప్రేమాయణం? డిన్నర్‌కు? (video)

రామాయణం: సీత పాత్రకు సాయి పల్లవి యాప్ట్ కాదంటోన్న నెటిజన్లు.. ట్రోల్స్ మొదలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments