Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గూగుల్.. ట్రంప్‌ను ''ఇడియట్''ను చేసేసింది..

గూగుల్.. ట్రంప్‌ను ''ఇడియట్''ను చేసేసింది..
, శనివారం, 15 డిశెంబరు 2018 (15:55 IST)
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను గూగుల్ ఇడియట్ చేసిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణంగా గూగుల్‌లో సెర్చ్ చేస్తే దొరకని విషయమంటూ వుండదు. నెట్టింట గూగుల్‌కు వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అయితే సెర్చింజన్ గూగుల్ ప్రస్తుతం వివాదంలో చిక్కుకుంది. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను అవమానపరిచిందని.. ఫిర్యాదులు వెల్లువెత్తాయి. 
 
అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పలు వివాదాస్పద నిర్ణయాలతో వార్తల్లో నిలుస్తున్న డొనాల్డ్ ట్రంప్‌పై విమర్శలొస్తున్న సంగతి తెలిసిందే. ట్రంప్ తీసుకునే నిర్ణయాలు ఓ ఇడియట్ తీసుకునేలా వున్నాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు విదేశీయులకు వీసాను రద్దు చేయడం, శత్రు దేశాలపై ఆర్థిక నిషేధం విధించడం, వలసదారులను వెలివేయడం వంటివే ఉదాహరణలు. 
 
ఈ చర్యల వల్ల ట్రంప్‌ను హేళన చేస్తూ సోషల్ మీడియాలో పదాలు పడ్డాయి. అయితే ప్రస్తుతం గూగుల్‌లో ఇడియట్ అని టైప్ చేస్తే ట్రంప్ ఫోటోలు కనిపిస్తున్నాయి. ఆయనకు సంబంధించిన వార్తలు రావడంతో అమెరికాలోని ట్రంప్ మద్దతు దారులు ఫైర్ అవుతున్నారు. ఆయన్ని గూగుల్ ఇడియట్‌గా చూపెట్టడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కన్నబిడ్డపై కన్నతల్లి లైంగిక దాడి.. ఫోటో తీసి బాయ్‌ఫ్రెండ్స్‌కు..