Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రెజిల్‌లో తలెత్తిన రాజకీయ సంక్షోభం ... త్రివిధ దళాధిపతుల రాజీనామా

Webdunia
బుధవారం, 31 మార్చి 2021 (22:37 IST)
బ్రెజిల్‌లో రాజ‌కీయ సంక్షోభం తలెత్తింది. దీంతో ఆ దేశ త్రివిధ ద‌ళాధిప‌తులు తమతమ పదవులకు రాజీనామా చేశారు. కోవిడ్ నియంత్ర‌ణ‌లో అధ్య‌క్షుడు బొల్స‌నారో విఫ‌లమయ్యారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ర‌క్ష‌ణ మంత్రిని మార్చాల‌నుకున్నారు. ఆ క్ర‌మంలోనే త్రివిధ ద‌ళాధిప‌తులు మూకుమ్మ‌డిగా త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేశారు. 
 
అయితే, తమ రాజీనామాలకు వారు ఎలాంటి కారణాలు వెల్లడించలేదు. రాజీనామా చేసిన వారి స్థానంలో కొత్త‌గా ఎవ‌ర్ని నియ‌మిస్తారో ఇంకా వెల్ల‌డించ‌లేదు. సైన్యంపై పూర్తి ఆధిప‌త్యాన్ని సాధించేందుకు బొల్స‌నారో ఈ మార్పులు చేస్తున్న‌ట్లు విశ్లేష‌కులు అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు.
 
కోవిడ్‌ను నియంత్రించ‌డంలో బొల్స‌నారో దారుణంగా విఫ‌లమైన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఆయ‌న పాపులారిటీ త‌గ్గిపోయింది. బ్రెజిల్‌లో ఇప్ప‌టివ‌ర‌కు క‌రోనా వ‌ల్ల సుమారు 3.14 ల‌క్ష‌ల మంది మ‌ర‌ణించారు. మంగ‌ళ‌వారం రోజు కొత్త‌గా సుమారు 4 వేల క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. 
 
రెండేళ్ల క్రితం అధ్య‌క్ష బాధ్య‌త‌లు చేప‌ట్టిన బొల్స‌నారో .. కోవిడ్ వేళ క్వారెంటైన్ ఆంక్ష‌ల‌ను వ్య‌తిరేకించారు. కోవిడ్ ఆంక్ష‌ల వ‌ల్ల ఆర్థిక వ్య‌వ‌స్థ దెబ్బ‌తింటుంద‌ని ఆరోపించారు. క‌రోనా గురించి ఆలోచించ వ‌ద్దు అంటూ ప్ర‌జ‌ల‌ను కోరారు కూడా. ముఖానికి మాస్క్ ధరించనక్కర్లేదని పిలుపునిచ్చారు. ఆ తర్వాత ఆయన కరోనా వైరస్ బారినపడి.. మృత్యువు అంచులకు వెళ్లి వచ్చారు. అప్పటికిగానీ ఆయనకు జ్ఞానోదయం కాలేదు. కరోనా ఆంక్షలతోపాటు.. మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాల్సిందేనంటూ సెలవిచ్చారు.
 
ఈ క్రమంలో విదేశాంగ‌, ర‌క్ష‌ణ శాఖ మంత్రులు సోమ‌వారం రాజీనామా చేశారు. దీంతో క్యాబినెట్‌ను మార్చాల‌ని బొల్స‌నారో నిర్ణ‌యించారు. అధ్య‌క్షుడి వ్య‌వ‌హారశైలితో వ్య‌తిరేకించిన ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ ద‌ళాధిప‌తులు.. ఒకేసారిగా రాజీనామా చేయ‌డం బ్రెజిల్ చ‌రిత్ర‌లో ఇదే మొద‌టిసారి. జ‌న‌ర‌ల్ ఎడ్స‌న్ లీల్ పుజోల్‌, అడ్మిర‌ల్ ఇల్‌క్వెస్ బార్బోసా, లెఫ్టినెంట్ బ్రిగేడియ‌ర్ ఆంటోనియో కార్లోస్ బెర్ముడేజ్‌లు మంగ‌ళవారం ఒకేసారి రాజీనామా చేశారు. అంత‌క‌ముందు విదేశాంగ మంత్రి ఆరుజో రాజీనామా చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments