Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కమల్ వర్సెస్ వానతి శ్రీనివాసన్: లిప్ సర్వీస్ చేస్తాడే కానీ పబ్లిక్ సర్వీస్ చేయడు..!

Advertiesment
కమల్ వర్సెస్ వానతి శ్రీనివాసన్: లిప్ సర్వీస్ చేస్తాడే కానీ పబ్లిక్ సర్వీస్ చేయడు..!
, బుధవారం, 31 మార్చి 2021 (18:40 IST)
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఎన్నికల బరిలో వున్న నాయకులు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. సెటైరికల్ కామెంట్లు చేసుకుంటున్నారు. తాజాగా సినీ లెజెండ్, మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్‌పై సెటైరికల్ కామెంట్లు చేశారు.. బీజేపీ నేత వానతి శ్రీనివాసన్.

వివరాల్లోకి వెళితే.. కోయంబత్తూరు దక్షణి అసెంబ్లీ స్థానం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇక్కడి నుంచి ఎంఎన్‌ఎం చీఫ్, నటుడు కమల్ హాసన్ బరిలోకి దిగగా.. బీజేపీ నుంచి వానతి శ్రీనివాసన్ పోటీ చేస్తున్నారు. 
 
కమల్ వర్సెస్ వనాతి శ్రీనివాసన్‌గా మారిపోయింది పరిస్థితి.. కమల్‌ను ఉద్దేశిస్తూ తీవ్ర విమర్శలు చేశారు వానతి శ్రీనివాసన్‌.. ఆయనను గెలిపిస్తే లిప్ సర్వీస్ చేస్తాడు.. తప్ప.. పబ్లిక్ సర్వీస్ చేయడని సెటైర్లు వేసిన వానతి శ్రీనివాసన్‌... ఎంఎన్‌ఎం చీఫ్ రెండు రకాల లిప్ సర్వీస్ చేయగలడు.. ఒకటి మాటలతో గారడి.. రెండోది ఏంటనేది నేను చెప్పక్కర్లేదు అంటూ ఎద్దేవా చేశారు. 
webdunia
Vanathi Srinivasan
 
మరోవైపు వానతి శ్రీనివాసన్ వ్యాఖ్యలపై ఎంఎన్ఎం చీఫ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటమి భయంతో ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని వ్యాఖ్యానించిన కమల్.. ఎన్నికల్లో ఆరోగ్యకరమైన పోటీ ఉండాలి.. కానీ, ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు ప్రజలు సహించరంటూ మండిపడ్డారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లిప్ కిస్‌లా వద్దు వద్దు.. నివేదా పేతురాజ్ No-Kiss Policy