కేంద్ర మాజీ మంత్రి, డీఎంకే సీనియర్ నేత ఏ.రాజాకు ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలో అనుచిత వ్యాఖ్యలు చేశారని రాజాపై ఫిర్యాదు అందడంతో ఈ మేరకు నోటీసులు ఇచ్చింది. తమిళనాడు సీఎం పళనిస్వామి, ఆయన తల్లినిని ఉద్దేశించి అసభ్యకర వ్యాఖ్యలు చేశారని రాజాపై అన్నాడీఎంకే నేతలు ఎన్నికల సంఘంకు ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు బుధవారం సాయంత్రంలోగా ఆరు గంటల్లోగా వివరణ ఇవ్వాలని రాజాను ఈసీ ఆదేశించింది. ఆ తర్వాత ఎలాంటి ప్రస్తావన లేకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. షోకాజ్ నోటీసులు ప్రచారంలో చేసిన వ్యాఖ్యలు అవమానకరంగా ఉండడమే కాకుండా మహిళల మాతృత్వ గౌరవాన్ని తగ్గించినట్లుగా ఉన్నాయని, ఇది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద తీవ్ర నిబంధనల ఉల్లంఘించినట్లుగా కనిపిస్తోందని కమిషన్ నోటీసుల్లో పేర్కొంది.
ఇటీవల థౌజండ్‌లైట్స్ నియోజకవర్గంలో డీఎంకే అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేసిన రాజా.. తమిళనాడు సీఎం పళనిస్వామి, ఆయన తల్లినిని ఉద్దేశించి అసభ్యకర వ్యాఖ్యలు చేశారని రాజాపై అన్నాడీఎంకే నేతలు ఎన్నికల సంఘంకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారపార్టీ నేతలు రాజాపై ఈసీకి ఫిర్యాదు చేశారు.
సీఎంను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సీఎం ఈపీఎస్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని, మహిళల మాతృత్వ గౌరవాన్ని తగ్గించినట్టుగా ఉన్నాయని ఈసీ ఆ నోటీసులో పేర్కొంది. ఆ వ్యాఖ్యలు కచ్చితంగా ఎన్నికల నిబంధన ఉల్లంఘన కిందికే వస్తాయని, వివరణ ఇవ్వాలని ఆదేశించింది. కాగా, పళనిస్వామిపై చేసిన వ్యాఖ్యలకు రాజా ఇప్పటికే క్షమాపణలు తెలిపారు.