Webdunia - Bharat's app for daily news and videos

Install App

జర్మనీలో అతిపెద్ద కబాబ్ రికార్డు... 423 కేజీలు.. మూలికల సాస్.. అదిరిపోయింది..

జర్మనీలో అతిపెద్ద కబాబ్ రికార్డు సృష్టించింది. జర్మనీ బెర్లిన్‌లోని ఓ షాపింగ్ సెంటర్‌లో టన్ను బరువున్న కబాబ్ తయారు చేసేందుకు ప్రయత్నించారు. కానీ అంత బరువు కుదరకపోవడంతో 423 కేజీల బరువున్న కబాబ్‌తో సరిప

Webdunia
సోమవారం, 23 అక్టోబరు 2017 (15:41 IST)
జర్మనీలో అతిపెద్ద కబాబ్ రికార్డు సృష్టించింది. జర్మనీ బెర్లిన్‌లోని ఓ షాపింగ్ సెంటర్‌లో టన్ను బరువున్న కబాబ్ తయారు చేసేందుకు ప్రయత్నించారు. కానీ అంత బరువు కుదరకపోవడంతో 423 కేజీల బరువున్న కబాబ్‌తో సరిపెట్టుకున్నారు.
 
టన్ను బరువుతో చేసిన కబాబ్ విరిగిపోవడంతో 423 కేజీలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయిన‌ప్ప‌టికీ గ‌త క‌బాబ్ రికార్డును ఈ భారీ క‌బాబ్ బ్రేక్ చేసింది. ఇంత‌కుముందు ఆస్ట్రేలియాలో 413 కేజీల క‌బాబ్ పేరున ఉన్న రికార్డును ఈ భారీ క‌బాబ్ బ్రేక్ చేసింద‌ని రికార్డ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ జ‌ర్మ‌నీ తెలిపింది.
 
ఈ కబాబ్‌ను మాంసం, బ్రెడ్‌, వెజిట‌బుల్ స‌లాడ్‌, క్యాబేజీలు వేసి ఈ క‌బాబ్‌ను త‌యారు చేశారు. అయితే దీన్ని ఆర‌గించ‌డానికి తోడుగా వెల్లుల్లి సాస్‌కి బదులుగా మూలిక‌ల సాస్ అందజేశారు. శవర్మా అని పిలిచే ఈ స్నాక్స్‌ను 1972లో ట‌ర్కీ నుంచి వ‌చ్చిన ఖాదిర్ నూర్మాన్ జ‌ర్మ‌నీకి ప‌రిచ‌యం చేశాడు. 
 
అప్పటి నుంచి ప్రాచుర్యం పొందింది. ఈ కబాబ్ రుచితో పాటు నాణ్యతతో వుంటుందని షాపింగ్ సెంటర్ డైరక్టర్ తెలిపారు. మూలికల సాస్‌తో పాటు కబాబ్ గార్లిక్ సాస్‌ను కూడా అందజేశామని యార్క్ స్ట్రెంపల్ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండియా, యుకె, యుఎస్ఏ వ్యాప్తంగా తమ బ్రేక్ త్రూ 2024 కోసం ఎంపికైన వ్యక్తులను వెల్లడించిన బాఫ్టా

సరైన అనుమతులు లేకుండా ఫామ్‌హౌస్‌ నిర్మాణం-నటుడు అలీకి నోటీసులు

పుష్ప-2 రికార్డు బద్ధలు: కిసిక్ సాంగ్‌ రిలీజ్.. ఎప్పుడంటే?

2025లో పెళ్లి పీటలెక్కనున్న తమన్నా- విజయ్ వర్మ?

రంగస్థలం.. గేమ్ ఛేంజర్.. సైకిల్ తొక్కుతున్న చెర్రీ.. టీడీపీ క్యాడర్ హ్యాపీ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments