ఉక్రెయిన్‌లో ఓ యువతి కారును ఎలా నడిపిందంటే.. ఆరుగురిని చంపేసింది?
ఉక్రెయిన్‌లో ఓ యువతి నిర్లక్ష్యంగా కారును నడిపి ఆరుగురిని పొట్టనబెట్టుకుంది. సిగ్నల్ పట్టించుకోకుండా కారును అతి వేగంగా నడిపింది. రోడ్డు మలుపులో అదుపు కోల్పోయింది. దీంతో కారు ఫుట్‌పాత్‌పైకి ఎక్కేస
ఉక్రెయిన్‌లో ఓ యువతి నిర్లక్ష్యంగా కారును నడిపి ఆరుగురిని పొట్టనబెట్టుకుంది. సిగ్నల్ పట్టించుకోకుండా కారును అతి వేగంగా నడిపింది. రోడ్డు మలుపులో అదుపు కోల్పోయింది. దీంతో కారు ఫుట్‌పాత్‌పైకి ఎక్కేసింది. దీంతో ఫుట్‌పాత్ వెళ్తున్న పాదాచారులపైకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారు ఢీ కొని, కారు కింద నలిగీ ఆరుమంది అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు.
వివరాల్లోకి వెళితే.. ఉక్రెయిన్‌లోనే అత్యంత ధనవంతుల జాబితాలో ఉన్న వ్యాస్సిల్లీ జైస్టేవ్ కుమార్తె. అత్యంత ఖరీదైన కారును నడుపుతూ అల్యోనా జైస్టీవ్ ఈ ప్రమాదానాకి కారణమైంది. ఈ ప్రమాదంలో ఆమె దోషిగా తెలితే ఉక్రెయిన్ చట్టాల ప్రకారం పదేళ్ల జైలుశిక్ష పడుతుందని పోలీసులు భావిస్తున్నారు. కారు నడుపుతూ ఖర్‌కోవ్‌లో రద్దీ రోడ్డుపై వెళ్తుండగా.. సిగ్నల్ పడినా పట్టించుకోలేదు.
దీనితో ట్రాఫిక్ పోలీసులు తనను పట్టుకుంటారేమోననే ఆందోళనతో వేగంగా కారు నడిపింది. నియంత్రణ కోల్పోయింది. కారు కాస్తా ఫుట్‌పాత్ మీదికి ఎక్కింది. ఈ ఘటనలో స్థానికులు ఆమెపై చేజేసుకున్నారు. కానీ భద్రతా సిబ్బంది ఆమెను అదుపులోకి తీసుకున్నారు.