Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హనీప్రీత్ సింగ్ చెప్పును కూడా వదల్లేదు.. ఫోటో తీసిన మీడియా.. సెల్ఫీల కోసం..

డేరా బాబా సన్నిహితురాలు, దత్తపుత్రిక హనీప్రీత్ సింగ్ అరెస్టయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోలీసుల రిమాండులో విచారణను ఎదుర్కొంటున్న హనీప్రీత్‌ను కోర్టుకు తీసుకొచ్చిన వేళ ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది.

Advertiesment
Honeypreet Insan
, బుధవారం, 11 అక్టోబరు 2017 (13:13 IST)
డేరా బాబా సన్నిహితురాలు, దత్తపుత్రిక హనీప్రీత్ సింగ్ అరెస్టయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోలీసుల రిమాండులో విచారణను ఎదుర్కొంటున్న హనీప్రీత్‌ను కోర్టుకు తీసుకొచ్చిన వేళ ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. రిమాండ్ పూర్తికావడంతో ఆమెకు కోర్టుకు తెచ్చిన పోలీసులు.. హనీప్రీత్ విచారణకు ఎంతమాత్రమూ సహకరించలేదన్నారు. 
 
వాదోపవాదాలు పూర్తయిన తర్వాత హనీప్రీత్ సింగ్‌ను పోలీసులు బయటకు తీసుకొచ్చారు. అక్కడే హనీ కోసం ఎదురుచూస్తున్న మీడియా ఒక్కసారిగా ఆమెతో మాట్లాడేందుకు ముందుకెళ్లింది. దీంతో హనీప్రీత్‌ను వేగంగా పోలీస్ వ్యానులోకి తీసుకెళ్లారు. 
 
ఆమె వ్యాన్ అలా ఎక్కగానే.. కింద ఓ తెగిపడిన మహిళ చెప్పు కనిపించింది. అది హనీప్రీత్‌దో కాదో.. అందరూ దాన్ని హనీప్రీత్‌ చెప్పుగానే భావించారు. మీడియా ఫోటోగ్రాఫర్లు ఆ చెప్పు ఫోటోలు తీసుకేందుకు ఎగబాకారు. ఎంతోమంది సెల్ఫీలు తీసుకుని మురిసిపోయారు. కాగా, కోర్టుకు వచ్చిన హనీప్రీత్ తనకు నడుం నొప్పిగా ఉందని, నిలుచోలేకపోతున్నానని, చేతులు జోడించి పోలీసులను వేడుకుందని జాతీయ మీడియా వెల్లడించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమేజాన్‌‌ను ముంచేశాడు: ఫోన్లు ఆర్డర్ చేసి.. ఖాళీ బాక్సంటూ రూ.50లక్షలు గుంజేశాడు..