Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బెనజీర్ భుట్టోకు వ్యతిరేకంగా ఏం చేశారో నేనింకా మరిచిపోలేదు: జర్దారీ

పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌పై మాజీ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ (62) సంచలన ఆరోపణలు చేశారు. నవాజ్ షరీఫ్ తనను రెండు సార్లు హత్య చేసేందుకు ప్రణాళిక రచించారని జర్దారీ ఆరోపించారు. నవాజ్ షరీఫ్ ఆయన

Advertiesment
బెనజీర్ భుట్టోకు వ్యతిరేకంగా ఏం చేశారో నేనింకా మరిచిపోలేదు: జర్దారీ
, సోమవారం, 23 అక్టోబరు 2017 (09:59 IST)
పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌పై మాజీ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ (62) సంచలన ఆరోపణలు చేశారు. నవాజ్ షరీఫ్ తనను రెండు సార్లు హత్య చేసేందుకు ప్రణాళిక రచించారని జర్దారీ ఆరోపించారు. నవాజ్ షరీఫ్ ఆయన సోదరుడు షాన్‌బాజ్ షరీఫ్‌లు ఇద్దరూ కలిసి తనను హతమార్చేందుకు పక్కా ప్లాన్ చేశారని, నవాజ్, షానబాజ్‌లు ఊసరవెల్లి టైపని విమర్శించారు. 
 
1990లలో అవినీతి ఆరోపణల కేసులో తాను ఎనిమిదేళ్లపాటు జైలులో ఉన్న సమయంలో అన్నదమ్ములు ఇద్దరూ కలిసి తన హత్యకు పథకం రచించారన్నారు. విచారణకు హాజరయ్యేందుకు కోర్టుకు హాజరయ్యే సమయంలో తనను హత్య చేయాలనుకున్నారని జర్దారీ పేర్కొన్నారు. లాహోర్‌లోని బిలావల్ హౌస్‌లో పార్టీ కార్యకర్తల సమావేశంలో జర్దారీ మాట్లాడుతూ.. తన భార్య బెనజీర్ భుట్టోకు వ్యతిరేకంగా వారు ఏం చేశారో తానింకా మరిచిపోలేదన్నారు. 
 
కానీ తాము వారిని క్షమించామన్నారు. పనామా కుంభకోణం కేసులో విచారణ ఎదుర్కొంటున్న వారిని ప్రజలు ఇక నమ్మే పరిస్థితి లేదన్నారు. వారితో చేతులు కలిపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. వారు త్వరగా రంగులు మార్చేస్తుంటారని ఎద్దేవా చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పడక గదిలో భార్యతో ఏకాంతంగా ఉన్నాడనీ...