Webdunia - Bharat's app for daily news and videos

Install App

దక్షిణాఫ్రికాలో ఘోరం... బంగారు గనిలో చిక్కున్న కార్మికులు.. 100 మంది మృతి

ఠాగూర్
బుధవారం, 15 జనవరి 2025 (09:18 IST)
ఆఫ్రికా దేశాల్లో ఒకటైన దక్షిణాఫ్రికాలో దారుణం జరిగింది. బంగారు గనిలో వందల మంది కార్మికులు చిక్కుకున్నారు. వీరిలో వంద మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన వారిని రక్షించేందుకు సౌతాఫ్రికా ప్రభుత్వ అధికారులు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. దక్షిణాఫ్రికాలోని బంగారు గనుల్లో తవ్వకాలు చేపట్టేందుకు వెళ్లిన అక్రమ మైనర్లు ఆహారం, నీరు లేక ఆకలితో అలమటిస్తూ మృత్యువాత పడుతున్నారు. ఇప్పటివరకు దాదాపు 100 మంది ప్రాణాలు కోల్పోయారు. సౌతాఫ్రికా వాయవ్య ప్రావిన్స్‌లో మూసివేసిన గనిలో ఈ ఘటన జరిగింది.
 
సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వీడియోల్లో మృతి చెందిన కార్మికుల కళేబరాలు కనిపిస్తున్నాయి. ఈ వీడియోలను జనరల్ ఇండస్ట్రీస్ వర్కర్స్ యూనియన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా (జీఐడబ్ల్యూయూఎస్ఏ) విడుదల చేసింది. 
 
ఇది విపత్కర పరిస్థితి అని ఈ సంస్థ అధ్యక్షుడు మామెట్లే సెబీ ఆవేదన వ్యక్తం చేశారు. వాడుకలలో లేని స్టింఫోంటైన్ గనిలో జరిగిన ఈ దారుణాన్ని సెబీ ఊచకోతగా అభివర్ణించారు. గనిలో మృతదేహాల కుప్పలు ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపుతున్నట్టు చెప్పారు.
 
దక్షిణాఫ్రికా ప్రభుత్వం 2023లో డిసెంబరులో గని ప్రవేశాన్ని మూసివేసేందుకు ఆపరేషన్ వల ఉమగోడీ (ఆపరేషన్ క్లోజ్ ద హోల్)ని ప్రారంభించి 13 వేల మంది అక్రమ మైనర్ల(గని కార్మికులు)ను అరెస్టు చేసింది. అయితే, అరెస్టు భయపడిన మరికొందరు కార్మికులు 2.5 కిలోమీటర్ల లోతున ఉండే స్టిల్ఫోంటీన్ గనిలో తలదాచుకున్నారు. దీంతో వారిని బయటకు రప్పించేందుకు ప్రభుత్వం వారికి ఆహారం, నీరు వెళ్లే మార్గాలను మూసివేసింది. 
 
దీంతో గదిలోనే చిక్కుకున్న వారు ఆకలితో అలమటిస్తూ ప్రాణాలు కోల్పోతున్నారు. గనిలో మైనర్లు మృత్యువాత పడుతుండటం, వీడియోలు వైరల్ అవుతుండటంతో స్పందించిన ప్రభుత్వం రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. తమకు సాయం చేయాలని, వెంటనే ఆహారం అందించాలని, తమను బయటకు తీసుకెళ్లాలని వేడుకుంటూ ఓ కార్మికుడు రికార్డు చేసిన వీడియో కూడా బయటకు వచ్చింది. ఇప్పటివరకు 9 మంది మైనర్ల మృతదేహాలను వెలికి తీశారు. 26 మందిని రక్షించారు.
 
అక్రమ మైనర్ల సమస్య దక్షిణాఫ్రికాలో దశాబ్దాలుగా ఉంది. బంగారం కోసం వీరు తమ ప్రాణాలను ఫణంగా పెడుతూనే ఉన్నారు. మూసివేసిన గనుల్లోకి ప్రవేశించి బంగారం కోసం తవ్వుతూ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. పేదరికం, నిరుద్యోగం వారిని ఈ దిశగా పురికొల్పుతున్నాయి. దీనికి తోడు సిండికేట్లు కూడా ఉండనే ఉన్నాయి. ఇవి వీరికి ఆశ చూసి అక్రమంగా మైనింగ్ చేయిస్తుంటాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ తో రొమాంటిక్ హారర్ జానర్ గా రాజా సాబ్

లవ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా దిల్ రూబా

విక్రాంత్, చాందినీ మధ్యలో ప్రెగ్నెన్సీ కిట్ నేపథ్యంలో సంతాన ప్రాప్తిరస్తు

Daku Maharaj: డాకు మహారాజ్‌ సినిమా చూసిన పురంధేశ్వరి ఫ్యామిలీ (video)

Sankranti: రామ్ చరణ్, ఉపాసన, క్లిన్ కారా సంక్రాంతి ఫోటో.. గేమ్ ఛేంజర్‌పై చెర్రీ స్పందన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి బఠానీలు తింటే కలిగే ప్రయోజనాలు

సర్వరోగ నివారిణి తులసి రసం తాగితే?

భోగి పండ్లుగా పిలిచే రేగు పండ్లు ఎందుకు తినాలి?

చలి కాలంలో బొంతను పూర్తిగా ముఖాన్ని కప్పేసి పడుకుంటే ఏం జరుగుతుంది?

పరోటా తింటే ఏం జరుగుతుందో తప్పక తెలుసుకోవాల్సినవి

తర్వాతి కథనం