భారత రిజర్వు బ్యాంకు బంగారాన్ని భారీగా సేకరిస్తుంది. ఇటీవలి కాలంలో ఆర్బీఐ బంగారం కొనుగోళ్లను గణనీయంగా పెంచింది. గత అక్టోబరు, నవంబరులో మరో 20 టన్నుల బంగారం కొనుగోలు చేయగా, ఈ ఆర్థిక సంవత్సరం (2024-25)లో మొదటి 8 నెలల్లో (ఏప్రిల్-నవంబరు) ఆర్బీఐ 50 టన్నుల బంగారం పోగే సింది. దీంతో రిజర్వ్ బ్యాంక్ వద్దనున్న మొత్తం బంగారం నిల్వలు 876.18 టన్నులకు పెరిగాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో పసిడి ధరలు 10 శాతం మేర పెరిగినప్పటికీ, ఆక్టోబరు - నవంబరు కాలంలో కాస్త నిలకడగానే కొనసాగాయి. దాంతో ఆర్బీఐ కొనుగోళ్లను పెంచింది.
విదేశీ మారకం (ఫారెక్స్) నిల్వల వివిధీకరణ వ్యూహంలో భాగంగానే ఆర్‌బీఐ పసిడి నిల్వలను పెంచుకుంటోంది. ఎందుకంటే, విదేశీ కరెన్సీలు ప్రధానంగా డాలర్ విలువలో హెచ్చుతగ్గులు మన ఫారెక్స్ నిల్వలపై చూపే ప్రభావాన్ని తగ్గించుకునేందుకు బంగారం నిల్వలు దోహ దపడనున్నాయి. గత నెల 27తో ముగిసిన వారంలో భారత్ వద్ద విదేశీ మారకం (ఫారెక్స్) నిల్వలు 411 కోట్ల డాలర్ల మేర తగ్గి 64,027 కోట్ల డాలర్లకు పరిమితమైనట్లు ఆర్బీఐ వెల్లడించింది.