Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వీడు సామాన్యుడు కాదు.. అసాధ్యుడు.. నాలుకతో ఫ్యాన్ రెక్కలను...

fan blades

ఠాగూర్

, ఆదివారం, 5 జనవరి 2025 (09:21 IST)
ప్రపంచంలోని కొందరు వ్యక్తులు అసాధ్యమనుకున్నపనిని సుసాధ్యం చేస్తుంటారు. అలాంటి పనులు చేసేవారు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో తమ పేరును సంపాదించుకుంటుంటారు. తాజాగా తెలంగాణ రాష్ట్రం సూర్యాపేటకు చెందిన క్రాంతి కుమార్ పనికెర అనే వ్యక్తి నాలుకతో టేబుల్ ఫ్యాన్ రెక్కలను ఆపేశాడు. అదీ కేవలం ఒకే ఒక్క నిమిషంలో 57 ఎలక్ట్రిక్ ఫ్యాన్ బ్లేడ్లను నిలిపాడు. ఈ సాహసోపేత పనితో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కెక్కాడు. 
 
సూర్యాపేట వాసి క్రాంతి కుమార్ ఒక్క నిమిషంలో 57 ఎలక్ట్రిక్ ఫ్యాన్ బ్లేడ్లను నాలుకతో ఆపేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ చోటు సంపాదించాడు. మనోడి ఈ సాహసోపేత ప్రదర్శన తాలూకు వీడియోను గిన్నిస్ బుక్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా పంచుకుంది. వీడియోలో వేగంగా తిరుగుతున్న ఫ్యాన్ బ్లేడ్లను క్రాంతి కుమార్ తన నాలుకతో ఆపడం కనిపించింది. కొన్ని ఫ్యాన్లను ఆపిన తర్వాత అతని నాలుకకు గాయమై రక్తం కారడం కూడా వీడియోలో ఉంది.
 
అయినా అతడు వెనుకడుగు వేయకుండా అలాగే ముందుకు సాగాడు. చివరికి ఒక్క నిమిషంలో 57 ఎలక్ట్రిక్ ఫ్యాన్ బ్లేడ్లను నాలుకతో ఆపి వరల్డ్ రికార్డు సృష్టించాడు. దీంతో క్రాంతి కుమార్‌కు గిన్నిస్ వరల్డ్ రికార్డు సంస్థ సర్టిఫికెట్ అందజేసింది. '57 ఎలక్ట్రిక్ ఫ్యాన్ బ్లేడ్లు క్రాంతి కుమార్ ఒక్క నిమిషంలో నాలుకను ఉపయోగించి ఆపేశారు' అని గిన్నిస్ బుక్ రాసుకొచ్చింది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు తమదైనశైలిలో స్పందిస్తున్నారు. 


Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేసీఆర్ ఫ్యామిలీ వెయ్యేళ్లు జైలుశిక్ష అనుభవించాలి : సీఎం రేవంత్ రెడ్డి (Video)