Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుమారుడికి కాబోయే భార్యను ప్రేమించి పెళ్లాడిన తండ్రి...!!

ఠాగూర్
బుధవారం, 15 జనవరి 2025 (09:13 IST)
తన కుమారుడుకు పెళ్లి చేసేందుకు కుదుర్చుకున్న యువతితో ఆ యువకుడు తండ్రి ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత ఓ రోజున వారిద్దరూ ఎవరికీ తెలియకుండా రహస్యంగా వివాహం చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న కుమారుడు తనకు పెళ్లిపై నమ్మకం పోయిందంటూ నిర్వేదం వ్యక్తం చేశాడు. ఈ ఆసక్తికర ఘటన మహారాష్ట్రలోని నాసిక్‌లో జరిగింది. 
 
ఓ వ్యక్తి తన కుమారుడికి పెళ్లి సంబంధాలు చూస్తూ ఓ అమ్మాయిని చూశాడు. కుమారుడుకి కూడా అమ్మాయి నచ్చడంతో పెళ్లి కుదిరింది. ముహూర్తాలు కూడా నిశ్చయించుకున్నారు. ఇరు కుటుంబాల ఇళ్లలోనూ పెళ్లి ఏర్పాట్లు మొదలు పెట్టారు. ఆ తర్వతా ఓ ట్విస్ట్ జరిగింది. 
 
వన్ ఫైన్ డే.. పెళ్లి కొడుకు తండ్రి, వధువు ఇద్దరూ సైలెంట్‌గా ఓ గుడిలో వివాహం చేసుకుని ఎంచక్కా ఇంటికొచ్చారు. తనకు కాబోయే భార్యతో పెళ్లి దుస్తుల్లో వచ్చిన తండ్రిని చూసి పెళ్లి కొడుకు నిర్ఘాంతపోయాడు. 
 
అటు పెళ్లి కుమార్తె ఇంట్లోనూ ఇలాంటి సీనే కనిపించింది. కోపంతో ఊగిపోయిన కుమారుడిని బుజ్జగించేందుకు మరో యువతిని వెతికి పెళ్లి చేస్తానని తండ్రి హామీ ఇచ్చినప్పటికీ అతడు నిరాకరించాడు. ఈ దెబ్బతో తనకు పెళ్లిపైనే నమ్మకం పోయిందని, సన్యాసిగా మారిపోతానని చెప్పుకొచ్చాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ తో రొమాంటిక్ హారర్ జానర్ గా రాజా సాబ్

లవ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా దిల్ రూబా

విక్రాంత్, చాందినీ మధ్యలో ప్రెగ్నెన్సీ కిట్ నేపథ్యంలో సంతాన ప్రాప్తిరస్తు

Daku Maharaj: డాకు మహారాజ్‌ సినిమా చూసిన పురంధేశ్వరి ఫ్యామిలీ (video)

Sankranti: రామ్ చరణ్, ఉపాసన, క్లిన్ కారా సంక్రాంతి ఫోటో.. గేమ్ ఛేంజర్‌పై చెర్రీ స్పందన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి బఠానీలు తింటే కలిగే ప్రయోజనాలు

సర్వరోగ నివారిణి తులసి రసం తాగితే?

భోగి పండ్లుగా పిలిచే రేగు పండ్లు ఎందుకు తినాలి?

చలి కాలంలో బొంతను పూర్తిగా ముఖాన్ని కప్పేసి పడుకుంటే ఏం జరుగుతుంది?

పరోటా తింటే ఏం జరుగుతుందో తప్పక తెలుసుకోవాల్సినవి

తర్వాతి కథనం
Show comments