Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆఫ్ఘనిస్థాన్‌లోని పోలీసు శిక్షణా స్థావరంపై తాలిబన్ దాడి

Webdunia
బుధవారం, 29 జనవరి 2020 (16:41 IST)
ఆఫ్ఘనిస్థాన్‌లోని పోలీసు శిక్షణా స్థావరంపై తాలిబన్ ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో 11 మంది పోలీసులు చనిపోయారు. మరో ఆరుగురు గాయపడినట్లు సమాచారం. బాగ్లాన్ ప్రావిస్స్‌లోని పోలీస్ శిక్షణా కేంద్రంపై తాలిబన్లు బాంబులతో ఎటాక్ చేశారు. శిక్షణ కేంద్రంలోని ఒక పోలీసు సహకారంతోనే ఉగ్రవాదులు ఈ దాడులు చేసి ఉంటారని స్థానిక ప్రభుత్వ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
 
బాగ్లాన్ ప్రావిన్షియల్ రాజధాని పులి ఖుమ్రీ శివార్లలో సోమవారం జరిగిన ఈ దాడికి ఏ సంస్థ బాధ్యత వహించలేదు. అయితే తాలిబన్లు ఈ ప్రావిన్స్‌లో బలమైన ఉనికిని కలిగి ఉన్నారు. తాలిబన్లు ఆఫ్ఘన్ భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకొని తరచుగా దాడులకు పాల్పడుతుంటారు.
 
యూఎస్, తాలిబన్లు కాల్పుల విరమణపై చర్చలు జరుపుతున్నాయి. ఈ చర్చలు సఫలం అయితే దాదాపు 13,000 మంది అమెరికన్ సైనికులు తమ దేశానికి వెళ్లే అవకాశముంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments