Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాబూల్‌లో విరుచుకుపడిన ఐఎస్: 63మంది మృతి.. 112 మందికి గాయాలు

ఐఎస్ ఉగ్రవాదుల దాడికి ఆప్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌ అట్టుడికింది. ఓటర్ల నమోదు కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడిలో 63 మంది మృతి చెందగా, 112 మంది గాయాల బారినపడ్డారు. ఆత్మాహు

Webdunia
సోమవారం, 23 ఏప్రియల్ 2018 (11:02 IST)
ఐఎస్ ఉగ్రవాదుల దాడికి ఆప్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌ అట్టుడికింది. ఓటర్ల నమోదు కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడిలో 63 మంది మృతి చెందగా, 112 మంది గాయాల బారినపడ్డారు. ఆత్మాహుతి దాడిలో మరణించిన వారిలో ఎక్కువ శాతం మంది మహిళలు, చిన్నారులేనని ప్రభుత్వం ప్రకటించింది. 
 
ఓటరు నమోదు కేంద్రం వద్దకు తాపీగా నడుచుకుంటూ వచ్చిన ఇస్లామిక్ స్టేట్ ఆత్మాహుతి దళ సభ్యుడు కార్యాలయం గేటు వద్ద తనను తాను పేల్చేసుకున్నాడు. దీంతో ఒక్కసారిగా భయానకంగా మారింది. రక్తం ఏరులై పారింది. పేలుడుతో అరుపులు, కేకలతో ఏం జరిగిందో తెలియ జనాలు పరుగులు తీశారు. 
 
ఈ ఏడాది అక్టోబరులో దేశంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాబూల్‌లో ఓటర్ల నమోదు కేంద్రాలు ఏర్పాటు చేసి గుర్తింపు కార్డులు ఇస్తున్నారు. ఇందుకోసం ఆదివారం ప్రజలు పెద్ద ఎత్తున కేంద్రాలకు చేరుకున్నారు. దీంతో ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. 
 
పేలుడు ధాటికి రెండంతస్తుల ఓటు నమోదు కేంద్రం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనతో తమకు ఎటువంటి సంబంధం లేదని ఆఫ్ఘాన్ తాలిబన్ ప్రకటించింది. కానీ ఇస్లామిక్ స్టేట్ ఓ ప్రకటన చేస్తూ దాడికి పాల్పడింది తామేనని స్పష్టం చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments