Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

డా. గజల్ శ్రీనివాస్‌కు “ఆఫ్ఘానిస్తాన్ ఒలింపిక్ శాంతి పతకం ప్రధానం”

ప్రఖ్యాత గజల్ గాయకులు, స్వచ్చ ఆంధ్ర బ్రాండ్ అంబాసిడర్ డా. గజల్ శ్రీనివాస్ ఆఫ్ఘానిస్తాన్‌లో శాంతి యాత్రలో భాగంగా శాంతి యాత్రను ప్రశంసిస్తూ ఆఫ్ఘానిస్తాన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు డా. మొహమద్ జహీర్ అక్భర్, ఒలింపిక్ అసోసియేషన్ "అత్యున్నత శాంతి గౌరవ

డా. గజల్ శ్రీనివాస్‌కు “ఆఫ్ఘానిస్తాన్ ఒలింపిక్ శాంతి పతకం ప్రధానం”
, శనివారం, 5 ఆగస్టు 2017 (21:44 IST)
ప్రఖ్యాత గజల్ గాయకులు, స్వచ్చ ఆంధ్ర బ్రాండ్ అంబాసిడర్ డా. గజల్ శ్రీనివాస్ ఆఫ్ఘానిస్తాన్‌లో శాంతి యాత్రలో భాగంగా శాంతి యాత్రను ప్రశంసిస్తూ ఆఫ్ఘానిస్తాన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు డా. మొహమద్ జహీర్ అక్భర్, ఒలింపిక్ అసోసియేషన్ "అత్యున్నత శాంతి గౌరవ పతకాన్ని" ఒక ప్రత్యేక సమావేశంలో అందజేసి సత్కరించారు.
 
డా. గజల్ శ్రీనివాస్ తన గానంతో దరి, ఫష్త భాషలలో శాంతి, స్నేహ గీతాలను ఆలపించి తన శాంతి యాత్ర ద్వారా సాంస్కృతిక, క్రీడలు, చలనచిత్ర, సేవా రంగాల ద్వారా భారత్-ఆఫ్ఘాన్ మధ్య ప్రజలలో సుహృద్భావాన్ని నెలకొల్పుతున్నారని, వారు ఆశించినట్లుగా భవిష్యత్తులో ఆఫ్ఘానిస్తాన్‌లో శాంతి సుహృద్భావ వాతావరణం ఏర్పడుతుందని, వారు చేసే శాంతి యాత్రకు ఎల్లప్పుడూ మా మద్దతు ఉంటుందని ఆఫ్ఘానిస్తాన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు డా.మొహమద్ జహీర్ అక్భర్ తెలిపారు.
 
అంతకుముందు భారతీయ రాయబారి కార్యాలయంలో డా. గజల్ శ్రీనివాస్ రూపొందించిన “సలాం-బోగో” ఆడియో సిడి ని భారత రాయబారి శ్రీ మన్ ప్రీత్ ఓరా ఆవిష్కరించగా, సలాం-బోగో వీడియోను ఆఫ్ఘానిస్తాన్ కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి డా. ఫిరోజుద్దీన్ ఫిరోజ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో శాంతి గీతాల రచయిత శ్రీ ఫజల్ హాది కఫ్షాని, ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి డా. యూనస్, ఆఫ్ఘానిస్తాన్ బుస్ట్-కషి క్రీడ అద్యక్షులు డా. అక్తారి, మైవాంద్ బ్యాంకు డైరెక్టర్ శ్రీ పి.వి.వి. రామరాజు పాల్గొన్నారు. 
 
ఆఫ్ఘానిస్తాన్ యూత్ సినిమా కౌన్సిల్ ఒక ప్రత్యేక సమావేశంలో, ఆఫ్ఘానిస్తాన్ చలనచిత్ర సూపర్‌స్టార్ సలీం షాహిన్ డా. గజల్ శ్రీనివాస్‌ను “ శాంతి పురస్కారంతో" సత్కరించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత 13వ ఉపరాష్ట్రపతిగా ఎం. వెంకయ్య నాయుడు(సొంతూరు వీడియో)