వెయిట్ లాస్ టిప్స్... ఇలా చేస్తే బరువు తగ్గుతారు...

Webdunia
గురువారం, 2 జూన్ 2022 (10:10 IST)
కంప్యూటర్ వర్క్ వచ్చిన దగ్గర్నుంచి కుర్చీలకు అతుక్కుపోయి కూర్చుని పనిచేస్తూ లావయ్యేవారు ఎక్కువవుతున్నారు. ఇప్పుడికి వర్క్ ఫ్రమ్ హోమ్ అనేసరికి ఇంట్లో నోటికి దొరికింది తింటూ మరీ స్థూలకాయులై ఇబ్బందిపడుతున్నారు. అందుకే వెయిట్ లాస్ చిట్కాలు పాటించి ఊబకాయ సమస్యతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు రాకుండా కొన్ని ఆరోగ్య సూత్రాలు పాటించాలి.

 
ఆహారపు అలవాట్లను సరైన పద్ధతిలో మలచుకుంటే ఈ సమస్య దరిచేరదు. ముందుగా సోమవారం నుంచి శుక్రవారం వరకు వారంరోజుపాటు డైట్ చేసి చూడండి. అది మీకు ఎంతవరకూ ఉపయోగపడుతుందో మీకే తెలుస్తుంది అని అంటున్నారు పోషకాహార నిపుణులు. ప్రతిరోజు తీసుకునే ఆహారం గురించి ఒక ప్రణాళిక తయారు చేయండి. ఈ విధంగా ప్రణాళిక వేసుకోవడం వల్ల మీరు తీసుకునే ఆహారంలో కంట్రోల్ ఉంటుంది.

 
ఆదివారం రెండు పూటల భోజనం ఉండేటట్లు చూసుకోవాలి. ఒక పూట మీకు నచ్చిన ఆహారం తీసుకోండి. ప్రతో రోజు వ్యాయామం చేయండి. కుదరకపోతే వారంలో కనీసం మూడు రోజులైనా వ్యాయామం చేయడం మంచిది. సోమ, మంగళ, బుధ వారాలైయితే మంచిది. ఎందుకంటే వారం చివరిలో మీరు బిజీగా ఉండొచ్చు కాబట్టి ఈ మూడు రోజులు మీరు వ్యాయామం చేస్తే మరుసటి మూడు రోజులు ఉత్సాహంగా ఉండగలరు.

 
ఉద్యోగ రీత్యా మీరు గంటల తరబడి కూర్చోవాల్సి వస్తుంది. కాబట్టి మధ్యాహ్నం భోజనం తరువాత 15 నుంచి అరగంట సమయం నడవడం మంచిది. ఒక రోజులో ఒక కప్పు టీ త్రాగటం ఉత్తమం. మీరు బ్రెక్ ఫాస్ట్‌ను ఉదయం 8 గంటలకు ముందు తీసుకోవాలి. ఈ భోజనం కూరగాయలతో ఉంటే ఇంకా మంచిది. తక్కువ క్యాలరీలు గల ఆహారం తీసుకోవాలి.

 
వారంలో కనీసం నాలుగు రోజులైనా మీ ఇంటినుండి భోజనం తీసుకొని రండి. దీనివల్ల బయట తిండి తగ్గుతుంది. ప్రోటీన్లు, కార్బోహైడ్రెట్లు సమృద్ధిగా ఉన్న కూరగాయలను వాడండి. భోజనం తరువాత ఒక కప్పు హెర్బల్ టీ త్రాగి 20 నిమిషాలు నడవండి. తద్వారా జీర్ణప్రక్రియ సాఫీగా అవుతుంది.

 
రాత్రిపూట త్వరగా నిద్రపోయి, ప్రొద్దునే త్వరగా మేల్కొండి. అప్పుడు మీ పనిలో ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటారు. లేదంటే నిద్ర సరిపడక మీరు పని చేస్తున్నప్పుడు సమస్యలు వస్తాయి. ప్రతిరోజు మూడు పూటల ఆహారం తీసుకోవడం మంచిది. బ్రేక్‌ఫాస్ట్ ఉదయం 8 గంటలకు, లంచ్ మద్యాహ్నం 1 గంటకు, డిన్నర్ రాత్రి 7 గంటలకు తినడం ఉత్తమమని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ఈ విధమైనటువంటి ఆహారం తీసుకోవడం వలన సులభంగా బరువు తగ్గొచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

బెంగళూరులో బోయ్స్ వేషంలో వచ్చి ఇళ్లను దోచుకుంటున్న గర్ల్స్

'కరీంనగర్ పిల్లా 143' పేరుతో భార్యాభర్తల గలీజ్ దందా ... ఎక్కడ?

దుబాయ్‌లో జనవరి 2026 శ్రేణి కచేరీలు, ఎవరెవరు వస్తున్నారు?

దేశంలో పట్టాలెక్కిన తొలి వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్

ఇద్దరు వివాహితలతో అక్రమ సంబంధం, కూడబలుక్కుని ప్రియుడిని చంపేసారు, ఎందుకు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ramcharan: ఫైర్ మీదున్నా.. తర్వాతి సవాల్‌కు సిద్ధం అంటున్న రామ్ చరణ్

వార్నీ... ఆ చిత్రంపై మోహన్ బాబు ఏమీ మాట్లాడకపోయినా బిగ్ న్యూసేనా?

Sankranti movies: వినోదాన్ని నమ్ముకున్న అగ్ర, కుర్ర హీరోలు - వచ్చేఏడాదికి అదే రిపీట్ అవుతుందా?

మధిరలో కృష్ణంరాజు డయాబెటిక్ వార్షిక హెల్త్ క్యాంప్ ప్రారంభించనున్న భట్టివిక్రమార్క

Netflix: బిగ్గెస్ట్ స్టార్స్ తో 2026 లైనప్‌ను అనౌన్స్ చేసిన నెట్‌ఫ్లిక్స్

తర్వాతి కథనం
Show comments