బరువు తగ్గించే శస్త్రచికిత్స విపరీతమైన ఊబకాయం ఉన్నవారికి బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఐతే ఆహారం, వ్యాయామం ద్వారా బరువు తగ్గలేకపోతే లేదా ఊబకాయం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉంటే ఇది ఒక ఎంపిక మాత్రమే.
వివిధ రకాల బరువు తగ్గించే శస్త్రచికిత్సలు ఉన్నాయి. అవి తరచుగా తీసుకోగల ఆహార పరిమాణాన్ని పరిమితం చేస్తాయి. కొన్ని రకాల శస్త్రచికిత్సలు ఆహారాన్ని ఎలా జీర్ణించుకోవాలో, పోషకాలను ఎలా గ్రహించాలో కూడా ప్రభావితం చేస్తాయి. ఐతే ఈ శస్త్ర చికిత్సలు తీసుకునేవారిలో అన్ని రకాలు ఇన్ఫెక్షన్లు, హెర్నియాలు, రక్తం గడ్డకట్టడం వంటి ప్రమాదాలు, సమస్యలు తలెత్తే అవకాసం వుంటాయి.
శస్త్రచికిత్స చేసిన తర్వాత చాలామంది త్వరగా బరువు కోల్పోతారు, కానీ తరువాత కొంత బరువును తిరిగి పొందుతారు. ఆహారం- వ్యాయామ సిఫార్సులను అనుసరిస్తే, శస్త్రచికిత్స లేకుండానే చాలా బరువును తగ్గించుకోవచ్చు. ఇలాంటివారికి మెడికల్ ఫాలో-అప్ జీవితాంతం అవసరమవుతుంది. ఐతే కొంతమంది ఈ కొవ్వును తగ్గించుకునే చికిత్స తీసుకుని ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు సైతం జరుగుతున్నాయి.