Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆయుర్వేదంలో గోంగూర... గోంగూర రసాన్ని అలా కలుపుకుని...

Webdunia
బుధవారం, 17 ఏప్రియల్ 2019 (20:10 IST)
ఆంధ్రమాతగా పిలవబడే గోంగూర అంటే తెలుగువారిలో చాలామందికి అమితమైన ఇష్టం. గోంగూరను రోజూ తింటే చాలా ఆరోగ్యంగా ఉండొచ్చు. గోంగూరలో చాలా మూలిక గుణాలున్నాయి. గోంగూరతో మంచి రుచికరమైన కూరలు, పచ్చళ్లు చేసుకుని తింటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. గోంగూరను ఆయుర్వేదంలో కూడా ఉపయోగిస్తారు. తరచూ గోంగూరను తినడం వలన మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలేమిటో తెలుసుకుందాం.
 
1. కొందరు రేచీకటికితో ఇబ్బందిపడుతుంటారు. అలాంటివారు తరచూ గోంగూరను కూరలుగా చేసుకుని తినాలి. లేదంటే గోంగూర పచ్చడిని అయినా రోజూ తింటూ ఉండాలి. అలాగే గోంగూర పూలతో కూడా దీన్ని నివారించొచ్చు. ముందుగా గోంగూర పూలను బాగా దంచుకోవాలి. తర్వాత రసాన్ని తీసుకోవాలి. ఆ రసాన్ని కాస్త వడగట్టుకోవాలి. దాన్ని పాలలో కలిపి తీసుకుంటే రేచీకటి సమస్య త్వరగా పరిష్కారం అవుతుంది.
 
2. తరుచుగా విరోచనాలకు గురయ్యే వారు కూడా గోంగూరతో మంచి ఫలితాన్ని పొందొచ్చు. గోంగూర నుంచి జిగురు తీసి దాన్ని నీటిలో కలుపుకుని తాగితే మంచి ఫలితం ఉంటుంది. 
 
3. కొందరి శరీరంలోకి ఎక్కువగా నీరు చేరి ఉంటుంది. అలాంటి వారు గోంగూరను పథ్యంగా తీసుకుంటే మంచిది. దీంతో ఒంటిలో ఉండే నీరంతా కూడా క్రమంగా తగ్గిపోతుంది.
 
4. గోంగూరలో ఎక్కువగా పొటాషియం ఉంటుంది. ఐరన్ కూడా ఎక్కువే ఉంటుంది. రక్త ప్రసరణను ఇది అదుపులో ఉంచగలదు. బ్లడ్‌లో ఇన్సులిన్‌ను ఎక్కువగా పెంచగల శక్తి గోంగూరకు ఉంటుంది.
 
5. షుగర్‌తో ఇబ్బందిపడేవారు తరచూ గోంగూరతో తయారుచేసిన ఆహారపదార్థాలు తింటే చాలా మంచిది. దీంతో షుగర్‌ను నియంత్రించొచ్చు.
 
6. గోంగూరలో చాలా రకాల విటమిన్స్ ఉంటాయి. దీంతో కంటి సంబంధిత వ్యాధులు తగ్గిపోతాయి. గోంగూరలో క్యాల్షియం కూడా బాగా ఉంటుంది. ఎముకలు బలంగా మారేందుకు గోంగూర బాగా ఉపయోగపడుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పవన్ కల్యాణ్‌కు దివ్వెల మాధురి వార్నింగ్.. డ్యాన్స్‌కు శ్రీనివాస్ ఫిదా (video)

బియ్యం గోడౌన్‌లో గంజాయి బ్యాగ్ పెట్టేందుకు ప్రయత్నించారు, పోలీసులపై పేర్ని నాని ఆరోపణ

భార్యపై కేసు పెట్టారు... తల్లిపై ఒట్టేసి చెప్తున్నా.. పేర్ని నాని

అల్లు అర్జున్ వ్యవహారంపై స్పందించిన పవన్ కల్యాణ్.. ఏమన్నారంటే?

APSRTC: హైదరాబాదు నుంచి ఏపీ- సంక్రాంతికి 2400 ప్రత్యేక బస్సులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాంటెస్ట్ ద్వారా డ్రింకర్ సాయి 31న మంచి పార్టీ ఇస్తాడు

నింద చిత్రానికి అంతర్జాతీయ స్ట్రీమింగ్ కి ఆమోదం

మ్యాడ్ స్క్వేర్ చిత్రం నుండి స్వాతి రెడ్డి.. గీతం విడుదల

అమెరికా, ఆస్ట్రేలియా లో కూడా రిలీజ్ కాబోతున్న పా.. పా.. మూవీ

ట్రెండింగ్‌లో సంక్రాంతికి వస్తున్నాం.. వెంకీ ఫన్నీ వీడియో వైరల్ (video)

తర్వాతి కథనం
Show comments