తులసిని హిందువులు దైవంగా కొలచి పూజిస్తారు. తులసి దైవపరంగానే కాదు తులసి ఆకులను ఉపయోగించి ఎన్నో వ్యాధులను నయం చేసుకోవచ్చు. ఆయుర్వేదంలో కూడా తులసికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. తులసి ఆకులను ప్రతి రోజు ఉదయం పరగడుపున తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.
1. తులసి ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండుట వలన శరీరంలో రోగనిరోధక వ్యవస్థను పటిష్ఠపరచి ఇన్ఫెక్షన్స్ రాకుండా రక్షణ కలిగిస్తుంది.
2. తులసి ఆకులను రెగ్యులర్‌గా తింటూ ఉంటే చర్మం మీద మృత కణాలు తొలగిపోయి చర్మం కాంతివంతంగా మారుతుంది.
3. తులసిలో ఉన్న లక్షణాలు డిప్రెషన్, ఆందోళన, మానసిక ఒత్తిడిలను తగ్గించటంలోసహాయపడతాయి. ఒత్తిడి తగ్గితే మానసిక ప్రశాంతత తగ్గుతుంది. అంతేకాకుండా రక్తంలో చెడు కొలస్ట్రాల్‌ని తగ్గించి మంచి కొలస్ట్రాల్ పెరిగేలా చేసి గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది.
4. లివర్‌లో ఉండే వ్యర్ధాలను బయటకు పంపటానికి సహాయపడుతుంది. లివర్ శుభ్రపడటమే కాకుండా మెటబాలిజం కూడా యాక్టివ్‌గా ఉంటుంది.
5. తులసి ఆకులను ప్రతి రోజు తినటం వలన జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడి అజీర్ణం, గ్యాస్, అసిడిటీ, మలబద్దకం వంటి సమస్యలు దూరం అవుతాయి.
6. తులసిలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలు సమృద్ధిగా ఉండుట వల్ల వాపులు,నొప్పుల నుండి మంచి ఉపశమనం కలుగుతుంది.