చాలామంది ఒత్తిడికి లోనై ప్రతిరోజు తలనొప్పితో బాధపడుతూ ఉంటారు. తలనొప్పి తగ్గేందుకు ఇష్టమొచ్చినట్లు టాబ్లెట్లు వాడేస్తుంటారు. అది సైడ్ ఎఫెక్ట్‌గా మారుతుందన్న విషయాన్ని పక్కనబెట్టేస్తారు. కానీ ఆయుర్వేదంలో మాత్రం తలనొప్పికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేని ఒక టీ తాగితే సరిపోతుందన్నారు ఆయుర్వేద నిపుణులు. అదేమిటంటే.. పుదీనా టీ.
మన ఇంటిలోని వస్తువులతోనే ఈ టీను తయారుచేసుకుని తాగితే తలనొప్పి మొత్తం ఎగిరిపోతుంది. పుదీనా టీను తయారుచేసుకోవడం చాలా ఈజీ. పుదీనా ఆకులు గుప్పెడు, గ్రీన్ టీ బ్యాగులు, రెండు చెంచాలు తేనె, నీళ్ళు రెండు కప్పులు, పుదీనా ఆకులని నీళ్ళలో వేసుకుని మంచి పరిమళం వ్యాపించే వరకూ నీటిని తక్కువ మంటపైన మరిగించుకోవాలి. ఆపైన గ్రీన్ టీ బ్యాగులు లేదా పొడి చేసి వడకట్టుకుని తేనె, నిమ్మరసంతో కలిపి సర్వ్ చేసుకుంటూ రుచిగా ఉంటుంది.
జలుబుని తగ్గించడంతో పాటు అజీర్తి సమస్యని అదుపులో ఉంచుతుంది పుదీనా టీ. అంతే కాదు తలనొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు పుదీనా టీ తాగితే ఉపశమనం కలుగుతుంది. నెలసరి ఇబ్బందులు వేధిస్తున్నప్పుడు పుదీనా టీ చక్కని ఉపశమనం ఇస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.