కరోనా వైరస్ కల్లోలం, పుచ్చకాయలను కొంటున్నారా?

Webdunia
బుధవారం, 8 ఏప్రియల్ 2020 (22:41 IST)
పుచ్చకాయలు వేసవి కాలం రాగానే దర్శనమిస్తాయి. వీటిని తింటూ హాయిగా దాహార్తిని తీర్చకుంటుంటాం. ఐతే కరోనా వైరస్ విజృంభిస్తున్న క్రమంలో వీటిని కొనాలన్నా భయపడుతున్నారు. ఐతే పుచ్చకాయలను కొనుక్కుని వచ్చి వాటిని శుభ్రంగా ఉప్పు నీటితో కొద్ది సేపు కడిగి ఆ తర్వాత ఓ నాలుగైదు గంటల తర్వాత ముక్కలుగా కోసుకుని తినవచ్చు. ఐతే శుభ్రపరచడంలో ఒక్కొక్కరు ఒక్కోలా చేసుకున్నప్పటికీ ఈ కాలంలో చాలా జాగ్రత్తగా వుండాలి మరి.
 
ఇకపోతే పుచ్చ ముక్కలను తిని గింజలను పడేస్తూ ఉంటాం. అయితే గింజలలో అనేక పోషక విలువలు ఉన్నాయి. పుచ్చకాయ గింజల్లో విటమిన్స్‌తో పాటు మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, పాస్పరస్, కాపర్, జింక్, మాంగనీస్ సమృద్ధిగా ఉంటాయి. పుచ్చగింజల్లో ఉన్న పోషక విలువలేమిటో చూద్దాం.
 
1. పుచ్చ గింజలలో ఉండే అమైనోఆసిడ్స్ రక్త నాళాలను వెడల్పు చేసి రక్త ప్రసరణ బాగా జరిగేలా చేసి గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. అంతేకాక రోగనిరోధక శక్తిని పెంచటానికి కూడా దోహదం చేస్తుంది.
 
2. ఈ గింజలలో ఐరన్ సమృద్ధిగా ఉండుట వలన శరీరంలో క్యాలరీలను శక్తిగా మార్చటంలో సహాయపడుతుంది.
 
3. మోనోసాచ్యురేటెడ్, పాలీ అన్‌సాచ్యూరేటెడ్ ఫ్యాటీ ఆసిడ్లు సమృద్ధిగా ఉండుట వలన గుండె ఆరోగ్యం బాగుంటుంది. అలాగే శరీరంలో కొలస్ట్రాల్ నిల్వలు లేకుండా చేయటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.
 
4. పుచ్చకాయలో ఉండే లైకోపిన్ అనే పదార్దము పురుషుల్లో వీర్యకణాల ఉత్పత్తిని పెంచుతుంది. అంతేకాకుండా వీటిల్లో ఉండే ప్రొటీన్, అమైనో ఆసిడ్లు శరీరంలో రక్తపోటును తగ్గించటంలో చాలా బాగా సహాయపడతాయి.
 
5. పుచ్చకాయ గింజల్లో ఎల్ సిట్రులిన్ సమృద్ధిగా ఉండుట వలన కండరాలు బలంగా ఉండేందుకు మరియు కండరాల కణజాలాన్ని రిపేర్ చేయటానికి బాగా సహాయపడుతుంది.
 
6. ఈ గింజల్లో ఉండే ఫోలేట్ లేదా ఫోలిక్ ఆసిడ్ మెదడు పనితీరులో సహాయపడటమే కాకుండా ఫ్రీ రాడికల్స్ బారి నుండి మెదడును రక్షిస్తుంది.
 
7. పుచ్చగింజల్ని నీటిలో వేసి మరిగించి టీ లా తాగడం వలన కిడ్నీలో ఏర్పడిన రాళ్లు కరిగిపోతాయి. అంతేకాకుండా జ్ఞాపకశక్తి పెరగడానికి, ఏకాగ్రతను పెంపొందించడానికి కండరాల కదలికల క్రమబద్దీకరణలో పుచ్చగింజలు తోడ్పడుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర... రాజోలులో రెక్కీ సక్సెస్

తీవ్రరూపం దాల్చిన దిత్వా తుపాను - ఏపీలో అత్యంత భారీ వర్షాలు

తాగుబోతు భర్త వేధింపులు.. భరించలేక హత్య చేసిన భార్య

Pawan Kalyan: అమరావతి అభివృద్ధికి కేంద్రం అమూల్యమైన మద్దతు.. పవన్ కల్యాణ్

కియర్ని- స్విగ్గీ వారి హౌ ఇండియా ఈట్స్ 2025 ఎడిషన్: డిన్నర్ కంటే అర్థరాత్రి భోజనాలు 3 రెట్లు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మరో 100 జన్మలైనా.. రజనీకాంత్‌లాగే పుట్టాలనుకుంటున్నా... తలైవర్ భావోద్వేగం

Akhil Raj: అఖిల్ రాజ్ హీరోగా సతీష్ గోగాడ దర్శకత్వంలో అర్జునుడి గీతోపదేశం

Raashi Singh: త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి లైఫ్ ఈజ్ ఎ గేమ్.. లిరికల్ సాంగ్

Suresh Babu: ఎమోసనల్‌ డ్రామా పతంగ్‌ చిత్రం : సురేష్‌బాబు

Anita Chowdhury: అంబాసిడర్ కారులో పదిమంది కుక్కేవారు : అనితా చౌదరి

తర్వాతి కథనం
Show comments