Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవసరమైన పోషకాల్లో 70% మాత్రమే అందిస్తున్న రోజువారీ భారతీయ సగటు ఆహారం

Webdunia
శనివారం, 11 సెప్టెంబరు 2021 (23:44 IST)
భారతదేశంలో బాయర్ కన్జ్యూమర్ హెల్త్ డివిజన్ కు చెందిన ఐకానిక్ మల్టీ విటమిన్ సప్లిమెంట్ బ్రాండ్ అయిన సుప్రాడైన్ ఇటీవల దేశవ్యాప్తంగా డాక్టర్ సారథ్యంలో నిర్వహించిన తన సర్వే ఫలితాలను ప్రకటించింది. అవసరమైన పోషకాలకు గాను భారతీయ సగటు రోజువారీ ఆహారం అందిస్తున్న పోషకాల మొత్తం ఎంతవరకు ఉందనే విషయంపై ఈ సర్వే జరిగింది.
 
ఏటా నిర్వహించే జాతీయ పోషక వారోత్సవాలను (సెప్టెం బర్ 01-07) పురస్కరించుకొని సుప్రాడైన్ న్యూట్రిషన్ సర్వే ఫలితాలను ప్రకటించారు. శరీరానికి రోజూ అవసరమైన పోషకాలకు సంబంధించి సగటున భారతీయ రోజువారీ ఆహారం నుంచి 70 శాతం దాకా, నిజా నికి అంత కంటే తక్కువ మొత్తంలోనే పోషకాలు లభ్యమవుతున్నట్లుగా పట్టణ ప్రాంతాలకు చెందిన వైద్యు లు, పోషక నిపుణుల్లో 85% మంది భావిస్తున్నట్లుగా ఈ సర్వేలో వెల్లడైంది.
 
బ్రాండ్ ఐగెన్ ఇన్ సైట్స్ అండ్ అనలిటిక్స్ ఈ సర్వేను నిర్వహించింది. ఇందులో భాగంగా దేశానికి చెందిన నా లుగు జోన్ల  (ఉత్తరం, దక్షిణం, తూర్పు, పశ్చిమ) లోని పెద్ద రాష్ట్రాల్లో 220 మంది హెల్త్ కేర్ ప్రాక్టీషనర్స్ (వై ద్యులు, పోషక నిపుణులు) ను సర్వే చేసింది. సగటు భోజనంలో తగినంతగా సూక్ష్మపోషకాల లభ్యత ఉంటుందా అనే అంశంపై ఈ సర్వే జరిగింది. శరీరానికి అవసరమైన 100% పోషకావసరాలను తీర్చుకోవడంలో ఉన్న పెను అంతరాన్ని ఈ సర్వే వెల్లడించింది. 
 
భారతదేశంలోని అన్ని జోన్లలోనూ పరిస్థితి ఇదే విధంగా ఉం ది. మాంసాహారాన్ని అధికంగా తీసుకునే రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. తమ రాష్ట్రపు సగటు ఆహారంలో కనీసం 30 శాతం దాకా పోషక అంతరం ఉన్నట్లుగా సుమారు 90శాతం మంది వైద్యులు తెలి పారు. దేశవ్యాప్తంగా సగటు ఆహారంలో బి12 మరియు డి3 విటమిన్ల కొరత అధికంగా ఉన్నట్లు ఈ అధ్యయ నంలో వెల్లడైంది. జింక్, ఐరన్, కాల్షియం, ఫోలిక్ యాసిడ్, విటమిన్ సి ఆ తరువాతి స్థానాల్లో నిలిచాయి.
 
రోజువారీ ఆహారంలో పోషకాలు తగినంతగా లభ్యం కాని సమస్యను రోజూ మల్టీవిటమిన్, మల్టీ మినరల్ సప్లి మెంట్స్ తీసుకోవడం ద్వారా అధిగమించవచ్చని 73% మంది వైద్యులు భావిస్తున్నారు. సగటు ఆహారంలో సూక్ష్మపోషకాల లభ్యత లోపం ఉందని, రోజూ సప్లిమెంట్ తీసుకోవడం ఆ లోపాన్ని అధిగమించేందుకు తోడ్ప డుతుందని విశ్వసించే వారిలో సగం మంది వైద్యులు, తమ వద్దకు అలసట, బలహీనత, శక్తిహీనతలతో వచ్చే వారికి మల్టీ విటమిన్ ను సిఫారసు చేస్తామని తెలిపారు.
 
ఈ సందర్భంగా బాయర్ కన్జ్యూమర్ హెల్త్ డివిజన్ ఇండియా కంట్రీ హెడ్ సందీప్ వర్మ ఈ సర్వే ఫలితాలపై మాట్లాడుతూ, ‘‘సంతోషదాయక ఆరోగ్యకరమైన జీవితాన్ని గడిపేందుకు సంపూర్ణ పోషకాలు పోషించే కీలక పాత్రపై అవగాహన పెంచడం జాతీయ పోషక వారోత్సవాల లక్ష్యం. మనం తీసుకునే రోజువారీ ఆహారంలో భారీస్థాయి పోషక అంతరం ఉన్నట్లుగా, సూక్ష్మపోషకాల లోపం అధికంగా ఉన్నట్లుగా సుప్రాడైన్ యొక్క డాక్టర్ సారథ్య న్యూట్రిషన్ సర్వే గుర్తించింది.
 
భారతదేశంలో వినియోగదారులకు సైన్స్ ఆధారిత పరిష్కారాలను అందించడంపై ప్రధానంగా దృష్టి పెట్టిన బ్రాండ్ గా, ప్రజలకు అవగాహన కల్పించాల్సిన ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవడం మాత్రమే గాకుండా రోగనిరోధకత, శక్తికి అవసరమైన కీలక పోషకాలను వారు 100% దాకా పొందడంలోనూ సుప్రాడైన్ డెయిలీ మల్టీ విటమిన్ సప్లిమెంట్స్ ద్వారా తోడ్పడుతున్నాం’’ అని అన్నారు.
 
కరోనా మహమ్మారి ప్రజల ప్రాథమ్యాలను మార్చివేసింది. ఆరోగ్యం, వెల్ నెస్ అనేవి ముఖ్యమైనవిగా మారా యి. దాంతో మనం మన రోజువారీ ఆహారం ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలను పొందేలా చూసుకోవ డం కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని జోయ్ హాస్పిటల్ కన్సల్టింగ్ ఫిజి షియన్, డిపార్ట్ మెంట్ ఆఫ్ మెడిసిన్ హెచ్ఒడి డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ మాట్లాడుతూ, ‘‘తమ రోజు వారీ ఆహారంలో పోషక సప్లిమెంట్స్ ను భాగం చేసుకునేందుకు సంబంధించి తప్పుడు సమాచారం కారణం గా ప్రజలు తరచూ భయపడుతుంటారు. మల్టీ విటమిన్, మల్టీమినరల్స్ సప్లిమెంట్స్ అనేవి శరీర అవసరా లకు అవసరమైన అన్ని ఆవశ్యక సూక్ష్మపోషకాలను కలిగిఉంటాయి. ఉదాహరణకు విటమిన్ బి అనేది ఆ హారం శక్తిగా మారేందుకు, నాడీ వ్యవస్థ సక్రమంగా పని చేసేందుకు తోడ్పడుతుంది. విటమిస్ సి, జింక్  రోగ నిరోధకత పనితీరును పెంచుతాయని నిరూపించబడింది. ఈ సర్వే సాధారణ ప్రజానీకం లో అవగాహన కలిగి స్తుందని, వారు తగినంతగా పోషకాలు పొందడంలో తోడ్పడుతుందని మేం విశ్వసిస్తున్నాం’’ అని అన్నారు.
 
సుప్రాడైన్ న్యూట్రిషన్ సర్వే - హెల్త్ కేర్ ప్రాక్టీషనర్ ప్రొఫైల్స్:
 
సర్వేలో పాల్గొన్న హెల్త్ కేర్ ప్రాక్టీషనర్లలో కనీసం 75 శాతం మంది ఒక దశాబ్దికిపైగా క్లినికల్ అను భవాన్ని కలిగిఉన్నారు.
 
అధ్యయనంలో పాల్గొన్న 206 మంది వైద్యుల్లో 189 మంది జనరల్ ప్రాక్టీషనర్స్. వారిలో 71% మం ది ఎంబీబీఎస్ డాక్టర్లు మరియు 29 శాతం మంది ఎండీలు; మిగిలిన 17 మంది వైద్యులు ఈఎన్టీ ఫిజీషియన్లు లేదా సర్జన్లు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కుమార్తెకు అత్తింటి వేధింపులు... చూడలేక తండ్రి ఆత్మహత్య

పార్శిల్ మృతదేహం మిస్టరీ : నిందితురాలిగా పదేళ్ల కుమార్తె!

పాకిస్థాన్‌ను తాలిబన్ ఫైటర్లు ఆక్రమిస్తారా?

ఆ విమాన ప్రమాదానికి పక్షుల గుంపు ఢీకొనడం కారణం కాదా?

దేశగతిని మార్చిన డాక్టర్ మన్మోహన్ సింగ్ బడ్జెట్!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

3 సినిమాతో తన కెరీర్ ముదనష్టం అయ్యిందంటున్న శ్రుతి హాసన్

ఆయనెవరో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంట.. పొద్దు తిరుగుడు పువ్వు అంట..? (video)

సంధ్య థియేటర్ తొక్కిసలాట : అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ వాయిదా

సీఎం రేవంత్‌తో చర్చించని విషయాలను కూడా రాస్తున్నారు : దిల్ రాజు

Raha: అలియా భట్‌ను మించిపోయిన రాహా.. క్యూట్‌గా హాయ్ చెప్తూ.. (వీడియో వైరల్)

తర్వాతి కథనం
Show comments