Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

Quinoa ఆరోగ్య ప్రయోజనాలు.. బరువు తగ్గాలనుకునే వారికి మంచి డైట్

Quinoa ఆరోగ్య ప్రయోజనాలు.. బరువు తగ్గాలనుకునే వారికి మంచి డైట్
, సోమవారం, 26 జులై 2021 (18:24 IST)
Quinoa
గోధుమలతో పోలిస్తే ఇందులో Quinoa ప్రోటీన్ శాతం ఎక్కువ. అదేసమయంలో వీటిల్లో గ్లూటెన్ ఉండదు. ఈ గింజలు రెండు నుంచి నాలుగు గంటల్లోనే మొలకలు వస్తాయి. దాంతో సలాడ్ల తయారీలో వాడుకోవడం సులభం. ముఖ్యంగా సలాడ్లలో ఈ గింజలు చక్కగా సరిపోతాయి. 
 
అలాగే ఆస్థియోపోరోసిస్ వ్యాధి ఉన్నవారు క్వినోవాని ఆహారంగా తీసుకోవడం మంచిది. ఇందులో ఉండే ప్రోటీన్లు, అమైనో ఆమ్లాలు, మెగ్నీషియం, మాంగనీస్ ఉండడం వల్ల ఎముకలని బలోపేతం చేయడానికి సాయపడతాయి. 
 
ముఖ్యంగా వృధ్ధులు దీన్ని ఆహారంగా తీసుకోవడం చాలా ఉత్తమం. ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల బరువు తగ్గాలనుకున్నా వారి డైట్‌లో దీన్ని చేర్చవచ్చు. అదీగాక హైడ్రాక్సీడాసోన్ ఉంటుంది. ఇది కేలరీలను కరిగించి బరువు తగ్గిస్తుంది.
 
రక్త హీనతతో బాధపడేవారు వండిన క్వినోవాని ఆహారంగా తీసుకోవాలి. ఇందులో ఐరన్ ఉంటుంది. అది రక్తహీనతను తగ్గిస్తుంది. ఇంకా రైబోఫ్లేవిన్ ఉంటుంది కాబట్టి రక్తం పుట్టుకువస్తుంది. క్వినోవా చెడు కొవ్వును తగ్గిస్తుంది. దానివల్ల గుండె మీద భారం పడదు. అందువల్ల గుండె సంబంధిత సమస్యలు తగ్గుతాయి.ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణక్రియ పనితీరు మెరుగవుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉల్లితో జుట్టుకు ఎంతో మేలు