Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్తిమీర కూరల్లో వేస్తుంటారు... ఎందుకని?

Webdunia
గురువారం, 18 జులై 2019 (21:43 IST)
ప్రకృతిలో సహజసిద్ధంగా లభించే కొత్తిమీరలో పలు రకాల ఆరోగ్యప్రయోజనాలు దాగి ఉన్నాయి. కూరల్లో చక్కని సువాసన, మంచి రుచిని ఇవ్వడం కొత్తిమీర సొంతం. అయితే కొత్తిమీర రుచిలోనే కాదు.... ఆరోగ్య సమస్యలను తగ్గించడంలో కూడా అద్బతంగా సహాయపడుతుంది. దీనిని తరచూ తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. అదెలాగో చూద్దాం.
 
1. కొత్తిమీరలో పీచు శాతం ఎక్కువ. ఇందులో మెగ్నీషియం, ఇనుము, మాంగనీస్‌లు తగిన మోతాదులో లభిస్తాయి.
 
2. దీనిలో విటమిన్ సి, కె లతో పాటు ప్రోటీన్లు కూడా ఎక్కువగా ఉంటాయి. దీనిని తరచూ ఆహారంలో భాగంగా చేసుకోవడం వలన శరీరంలో హాని చేసే కొవ్వు తగ్గుతుంది. అంతేకాకుండా జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది.
 
3. మధుమేహంతో బాధపడేవారికి ఇది చక్కని ఔషధంలా పని చేస్తుంది. రక్తంలోని చక్కెర నిల్వలను సమన్వయపరుస్తుంది. 
 
4. దీనిలో లభించే విటమిన్ కె వయసు మళ్లిన తరువాత వచ్చే మతిమరుపు వ్యాధి నియంత్రణలో కీలకంగా పని చేస్తుంది. అంతేకాకుండా కొవ్వును కరిగించే విటమిన్లూ, యాంటీ ఆక్సిడెంట్లు దీనిలో అధికంగా లభిస్తాయి.
 
5. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కీళ్లనొప్పులను తగ్గిస్తాయి. 
 
6. కొత్తిమీరలోని యాంటీసెప్టిక్ లక్షణాలు నోటిపూతను తగ్గిస్తాయి. అంతేకాకుండా మహిళల్లో వచ్చే నెలసరి ఇబ్బందులను తగ్గిస్తాయి.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments