Webdunia - Bharat's app for daily news and videos

Install App

టెంపాలో కాన్సులర్ సర్వీసెస్ క్యాంప్ ఏర్పాటు చేసిన నాట్స్... పాస్ పోర్ట్ రెన్యువల్, వీసా ఇంకా...

Webdunia
గురువారం, 18 జులై 2019 (17:42 IST)
ఫ్లోరిడా: అమెరికాలో తెలుగువారికి సేవలు అందించడంలో కీలక పాత్ర పోషించే ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ టెంపా నగరంలోని హెటీఎప్ ఆడిటోరియంలో కాన్సులర్ సర్వీసెస్ క్యాంప్‌ను ఏర్పాటు చేసింది. కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా అట్లాంటా, ఇండియన్ కమ్యూనిటీ ఆఫ్ టెంపా బే, నాట్స్ టెంపా బే విభాగాలు సంయుక్తంగా ఈ సర్వీసెస్ క్యాంప్‌ను ఏర్పాటు చేశాయి. 
 
దాదాపు 350 మందికి పైగా ఇక్కడ సేవలను వినియోగించుకున్నారు. వీసా రెన్యూవల్స్‌కు సంబంధించి 100 మందికి పైగా దరఖాస్తులు చేసుకున్నారు. ఫవర్ ఆఫ్ అటార్నీ, లైఫ్ సర్టిఫికెట్, లీగల్ డాక్యుమెంట్లకు సంబంధించి 50 మందికి పైగా దరఖాస్తు చేస్తున్నారు. ఇమ్మిగ్రేషన్ సేవలకు సంబంధించి ఇంత మంచి కార్యక్రమాన్ని నాట్స్ చేపట్టినట్టుందుకు స్థానిక తెలుగువారితో పాటు భారతీయులు నాట్స్ పైన ప్రశంసల వర్షం కురిపించారు.
 
టెంపా నాట్స్ చాప్టర్ సమన్వయకర్త రాజేశ్ కాండ్రు నేతృత్వంలో ఈ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నాట్స్ వాలంటీర్లు దీనికోసం ప్రచారం చేయడంతో పాటు ఈ సేవా కేంద్రంలో తమ విలువైన సేవలు అందించారు. టెంపాలో తెలుగువారి కోసం మరిన్ని కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా నాట్స్ నాయకత్వం తెలిపింది.

సంబంధిత వార్తలు

పల్నాడులో ఫలితం ముందే తెలిసిపోయిందా? అందుకే అలా?

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

భర్తను రౌడీషీటర్‌తో హత్య.. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించింది.. చివరికి?

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

తర్వాతి కథనం
Show comments