Webdunia - Bharat's app for daily news and videos

Install App

రక్తపోటు వున్నవారు ఈ 3 పనులు చేస్తే...?

Webdunia
బుధవారం, 23 సెప్టెంబరు 2020 (22:43 IST)
రక్తపోటు వున్నవారు ఆందోళన చెందకూడదు. విపరీతమైన కోపం పనికిరాదు. శాంతంగా వుండాలి. రక్తపోటును అదుపులో పెట్టుకునేందుకు ఈ చిట్కాలు పాటిస్తే కూడా ప్రయోజనం వుంటుందని వైద్యులు చెపుతున్నారు.
 
నెమ్మదిగా, దీర్ఘంగా శ్వాస తీసుకోవటం వల్ల మహిళల్లో రక్తపోటు 14 పాయింట్లు తగ్గుతున్నట్టు బయటపడింది. ఈ ప్రక్రియ ఒత్తిడి హార్మోన్ల ఉత్పత్తిని తగ్గిస్తుంది. దీంతో రక్తనాళాలు వదులుగా అవుతాయి, రక్తపోటు అదుపులో ఉంటుంది.
 
అలాగే పచ్చని ప్రకృతి దృశ్యాలను చూసినప్పుడు మెదడులో హాయిని కలిగించే అల్ఫా తరంగాలు పుట్టుకొస్తాయి. ఇవి కేంద్ర నాడీ వ్యవస్థను ప్రశాంతంగా ఉంచుతాయి. రక్తపోటును పెంచే కార్టిజోల్‌ హార్మోన్‌ ఉత్పత్తినీ తగ్గిస్తాయి. కాబట్టి గోడ మీద ప్రకృతి దృశ్యాల చిత్రాలను అలంకరించుకోవటం మంచిది.
 
ఇకపోతే కుర్చీలో ముందుకు వంగి కూచున్నప్పుడు రక్తపోటు పదహారు శాతం వరకు పెరుగుతుంది. మన మెడలో ప్రశాంతతకు సంబంధించిన సందేశాలను మెదడుకు చేరవేసే నాడులుంటాయి. ముందుకు వంగటం వల్ల మెడలోని వెన్నుపాము, డిస్కుల మీదా ఒత్తిడి పడుతుంది. దీంతో ఆ భాగంలోని సున్నితమైన నాడులు నొక్కుకుపోయి వాటి పనితీరు మందగిస్తుంది. అందువల్ల వీలైనంతవరకు నిటారుగా కూచుంటే మంచిది.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments