వేసవిలో సహజంగానే చాలా మందికి వేడి చేస్తుంటుంది. అలాంటి వారు ఉదయాన్నే పరగడుపునే అంజీర్ పండ్లను తింటే శరీరానికి చలువ చేస్తుంది. వేడి తగ్గుతుంది. హైబీపీతో బాధపడేవారు నిత్యం అంజీర్ పండ్లను తినాలి. వీటిలోఉండే పొటాషియం హైబీపీని తగ్గిస్తుంది. గుండె సమస్యలు రాకుండా చూస్తుంది. అంజీర్ పండ్లలో ఉండే ఐరన్ రక్తహీనత సమస్యను పోగొడుతుంది.
అంజీర్ పండ్లను తింటే నిద్రలేమి సమస్య పోతుంది. నిద్ర చక్కగా పడుతుంది. అలాగే డయాబెటిస్ అదుపులోకి వస్తుంది. శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఎముకలు దృఢంగా మారుతాయి. అంజీర్ పండ్లను తినడం వల్ల పలు రకాల క్యాన్సర్లు రాకుండా చూసుకోవచ్చని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.
అలాగే వేసవిలో రోజుకు పది గంటల పాటు హాయిగా నిద్రపోవాలి. రోజుకి ఎనిమిది నుంచి పదిగంటల పాటు నిద్రపోవడం ద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. సరిపడ నిద్రపోవడం వలన హార్మోన్లు సమతుల్యం అవుతాయి. రోజు మొత్తం మీద ఎనిమిది నుంచి పది గ్లాసుల నీరు తప్పనిసరిగా తాగాలి. రోగనిరోధక శక్తి పెంపొందించుకోవడానికి నీరు మందుగా పని చేస్తుంది.
ముఖ్యంగా పోషకాహారం తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తిని త్వరితగతిన పెంపొందించు కోవచ్చు. విటమిన్లు, మినరల్స్ తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తిని మెరుగుపరుచుకోవచ్చు. మినరల్స్ అధికంగా లభించే చేపలు, కొవ్వు తక్కువగా ఉండే పాల ఉత్పత్తులు, గింజలు, విటమిన్ ఎ ఎక్కువగా ఉండే గుడ్లు, లివర్, బిటాకెరోటిన్ ఉండే పాలకూర, చిలగడదుంప, క్యారెట్ వంటివి తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తిని త్వరితగతిన పెంపొందించుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.