రక్తపోటు వున్నవారు పుట్టగొడుగులు తినాలి, ఎందుకంటే? (video)

సోమవారం, 13 జులై 2020 (23:07 IST)
వర్షపు జల్లులు మొదలవగానే పుట్టగొడుకులు పొడుచుకువస్తాయి. అదేనండీ పొలాల్లో పుట్టగొడుకులు మొలుస్తాయి. ఈ పుట్టగొడుగుల్లో 80 శాతానికి పైగా నీరే ఉంటుంది. రోజుకి 200 గ్రాముల చొప్పున వారానికి ఐదుసార్లు వీటిని తింటే రక్తపోటు తగ్గటానికి తోడ్పడతాయి. పుట్టగొడుగుల్లోని పొటాషియం పక్షవాతం ముప్పునూ అరికట్టేందుకు సాయం చేస్తుంది. రైబోఫ్లావిన్‌, నియాసిన్‌లు శరీరంలో విశృంఖల కణాల మూలంగా కలిగే హానిని నియంత్రిస్తాయి. ఇక విటమిన్‌ ఈ, సెలీనియం ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ ముప్పును తగ్గిస్తాయి.
 
పుట్ట గొడుగులలో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. శరీరంలోని కొవ్వు శాతాన్ని తగ్గించేందుకు పుట్టగొడుగులు చక్కగా పనిచేస్తాయి. ఈ పుట్టగొడుగులో విటమిన్ బి6, సి, డి, ఐరన్, మెగ్నిషియం, పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. అధిక రక్తపోటును తగ్గించడానికి పుట్టగొడుగులు చాలా ఉపయోగపడుతాయి.
 
ఈ పుట్టగొడుగులు తెలుపు, నలుపు, గోధుమ వర్ణాలలో రకరకలుగా ఉంటాయి. ఆయుర్వేద భావప్రకాశ సంహితలో పరిశుభ్రమైన ప్రదేశంలో పెరిగినవి తెల్ల రంగులో ఉన్నవి తినడానికి యోగ్యమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కర్రలు, పేడలపై పుట్టినవి తెల్లగా ఉంటే అంతగా దోషకరం కావు కాబట్టి వాటిని కూడా తినొచ్చు. 
 
ఇతర రకాలైన పుట్ట గొడుగులు ఎక్కువ జిగురుగా ఉండి, అత్యంత శీతకరమై కఫాన్ని వృద్ధిచేయడమే కాకుండా వాంతులు, విరేచనాలు, జ్వరాలు వంటి సమస్యల నుండి కాపాడుతాయి. కావున పుట్టగొడుగులను ఆహారంలో చేర్చుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చును. 
 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం ఈ నాలుగు డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంతో అవసరం (Video)