Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవంబరు నెలలో తీసుకోదగిన ఆహారం, క్యాలీ ఫ్లవర్ రైస్ ఎలాగంటే?

ఆయా వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మనం తీసుకునే ఆహార అలవాట్లతో పాటు తీసుకునే ఆహారం కూడా మారిపోతుంటుంది. నవంబరు నెలలో విరివిగా లభించేవాటిలో క్యాలీఫ్లవర్ ఒకటి. ఇందులో విటమిన్ ఎ, యాంటి ఆక్సిడెంట్స్ ఉన్నాయి. ఉడికించిన లేదా పచ్చి క్యాలీఫ్లవర్‌ను వ్యాయామాన

Webdunia
మంగళవారం, 21 నవంబరు 2017 (16:44 IST)
ఆయా వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మనం తీసుకునే ఆహార అలవాట్లతో పాటు తీసుకునే ఆహారం కూడా మారిపోతుంటుంది. నవంబరు నెలలో విరివిగా లభించేవాటిలో క్యాలీఫ్లవర్ ఒకటి. ఇందులో విటమిన్ ఎ, యాంటి ఆక్సిడెంట్స్ ఉన్నాయి. ఉడికించిన లేదా పచ్చి క్యాలీఫ్లవర్‌ను వ్యాయామానికి ముందు లేదా తర్వాత అయినా తీసుకోవచ్చు. క్యాలీఫ్లవర్ సాధారణంగా ఎక్కువ మొత్తంలో ఫైబర్‌లను కలిగి ఉండి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. క్యాలీఫ్లవర్‌లోని యాంటీ యాక్లిడెంట్లు క్యాన్సర్ కారకాలపై పోరాడుతాయి. 
 
కిడ్నీ సంబంధిత వ్యాధులకు క్యాలీఫ్లవర్ దివ్యౌషధంగా పనిచేస్తుంది. యూరినరీ ఇన్ఫెక్షన్ల నుంచి బయటపడటానికి క్యాలిఫ్లవర్ చక్కటి పరిష్కారం. వారానికి రెండు లేదా మూడుసార్లు క్యాలీఫ్లవర్‌ను డైట్‌లో చేర్చుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. ఇక క్యాలీఫ్లవర్ రైస్ ఎలా చేయాలో తెలుసుకుందాం...
 
కావలసిన పదార్థాలు:
బాస్మతి బియ్యం - రెండు కప్పులు. 
నూనె - పావు కప్పు. 
పసుపు - ఒక టేబుల్‌ స్పూన్‌. 
క్యాలీఫ్లవర్‌ - ఒకటి. 
ఆలుగడ్డలు - మూడు. 
అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ - ఒక స్పూన్‌. 
పచ్చిమిర్చి - నాలుగు. 
ఉల్లిపాయలు - మూడు. 
టమోటాలు - మూడు. 
ఉప్పు - తగినంత. 
 
తయారీ విధానం: 
ముందుగా బియ్యాన్ని నూనెలో కొద్దిగా వేయించి ఆ తర్వాత దానిని ఉడికించి పక్కన పెట్టుకోవాలి. కాలిఫ్లవర్‌ను వేడినీటిలో ఉడికించుకోవాలి. తర్వాత ఆలుగడ్డలను చిన్న ముక్కలు చేసి నూనెలో వేయించాలి. పాన్‌లో నూనె వేసి, తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేయించాలి. అల్లం, వెల్లుల్లి పేస్టును, తరిగిన టమోటాలను కూడా వేపుకోవాలి. 
 
తర్వాత పసుపు పొడి, కారం, పొడి మసాలా, పచ్చిమిర్చి ముక్కలు కూడా అందులో వేసి వేపుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు వేసి చివరిగా ఉడికించిన కాలిఫ్లవర్‌ను కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఉడికించిన బాస్మతి రైస్‌తో కలుపుకుని, ఆలు ముక్కలు చేర్చి హాట్ హాట్‌గా చికెన్ గ్రేవీతో సర్వ్ చేయొచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

చిన్నారిపై హత్యాచారం చేసిన నిందితుడి ఎన్‌కౌంటర్: PSI అన్నపూర్ణకు అభినందనలు

పంచ్‌లు - కిక్‌లు లేకుండా నిస్సారంగా సాగిన రోబోల బాక్సింగ్ (Video)

కారు డోర్ లాక్ : ఊపిరాడక అక్కా చెల్లెళ్లు మృతి

గర్భిణీ భార్యను గొంతు నులిమి హత్య చేసిన కసాయి భర్త!!

తరగతి గదులను కూల్‌గా ఉంచేందుకు ఆ లేడీ టీచర్ ఏం చేసిందో తెలుసా? (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

తర్వాతి కథనం
Show comments