వైలట్ కలర్ వంకాయతో మేలెంత?
వైలట్ కలర్ వంకాయతో ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. తెలుపు వంకాయల కంటే వైలెట్ కలర్ వంకాయలో ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలంగా వున్నాయి. తెలుపు, పచ్చ రంగులో వున్న వంకాయలతో పో
వైలట్ కలర్ వంకాయతో ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. తెలుపు వంకాయల కంటే వైలెట్ కలర్ వంకాయలో ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలంగా వున్నాయి. తెలుపు, పచ్చ రంగులో వున్న వంకాయలతో పోల్చితే వైలెట్ కలర్ వంకాయ పెరిగే క్రమంలో సూర్యుని నుండి అధిక కాంతిని గ్రహిస్తుంది.
అధిక సూర్యరశ్మిని ఉపయోగించుకుంటూ పెరిగిన మొక్కల నుండి వచ్చే ఆహార పదార్థాలు తినడానికి చాలా శ్రేయస్కరం. వైలెట్ కలర్ వంకాయను కడుపు నిండా తినొచ్చు. జొన్నరొట్టె, సజ్జరొట్టె వంకాయ కూరను కలిపి తీసుకోవడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.
వైలట్ కలర్ వంకాయతో గుండె జబ్బులను దూరం చేసుకోవచ్చు. క్యాన్సర్‌కు చెక్ పెట్టవచ్చు. బరువును తగ్గించుకోవచ్చు. బీపీని అదుపులో వుంచుకోవచ్చు. రక్తహీనతను నయం చేసుకోవచ్చు. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. పంటికి, కళ్లకు మేలు చేసే వైలట్ కలర్ వంకాయను వారానికి రెండుసార్లు ఆహారంలో చేర్చుకోవాలి. ఇందులోని ఫైబర్ బరువు తగ్గిస్తుంది. ఎముకలకు బలాన్నిస్తుందని ఆయుర్వేద నిపుణుల అంటున్నారు.