వర్షాకాలంలో వేడి వేడి పకోడీలు, బజ్జీలు లాగించేస్తున్నారా?
వర్షాకాలం, శీతాకాలంలో వేడి వేడి పకోడీలు, బజ్జీలు వంటి నూనెలో వేయించిన ఆహార పదార్థాల వేడిగా లాగించేస్తుంటాం. అయితే వర్షాకాలం, శీతాకాలంలో ఫ్రైడ్ ఆహార పదార్థాలను తీసుకోకూడదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున
వర్షాకాలం, శీతాకాలంలో వేడి వేడి పకోడీలు, బజ్జీలు వంటి నూనెలో వేయించిన ఆహార పదార్థాల వేడిగా లాగించేస్తుంటాం. అయితే వర్షాకాలం, శీతాకాలంలో ఫ్రైడ్ ఆహార పదార్థాలను తీసుకోకూడదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. బాగా నూనెలో వేయించిన పదార్థాలను వర్షాకాలంలో కానీ, శీతాకాలంలో కానీ తీసుకుంటే జీర్ణ వ్యవస్థ మందగిస్తుంది. తీసుకున్న ఆహారం కూడా జీర్ణం కాదు.
ఇంకా ఫ్రై చేసిన ఆహారం తింటే ఇక అజీర్తి సమస్య వస్తుంది. దాంతో అది గ్యాస్, అసిడిటీకి దారి తీస్తుంది. కనుక ఈ కాలంలో ఫ్రై ఫుడ్స్‌ను తినకపోవడమే మంచిది. అలాగే ఆకుపచ్చని కూరలు, ఆకుకూరలను కూడా వర్షాకాలం, శీతాకాలంలో తినకపోవడం మంచిది. ఇవి ఆరోగ్యానికి మేలు చేసినా.. వాటిలో వుండే క్రిములు, బ్యాక్టీరియాలతో ప్రమాదం వుంది.
ఒకవేళ తినాలనుకునే వారు.. వేడినీటిలో ఐదు నిమిషాలుంచి శుభ్రపరిచి వండుకుని తినాలి. పచ్చిగా సలాడ్స్ రూపంలో తీసుకోకూడదు. ఇంకా రెస్టారెంట్లు, హోటల్స్‌లో అమ్మే తాజా పండ్ల రసాలను తీసుకోకూడదు. దానికి బదులు ఇంట్లోనే తయారు చేసుకుని తాగడం మంచిది. ఇక ముఖ్యంగా కూల్ డ్రింక్స్ వానాకాలం, శీతాకాలంలో తాగకూడదు. దీంతో జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. జీర్ణాశయంలో ఉండే ఎంజైమ్‌ల పనితీరుకు ఆటంకం కలుగుతుంది. కనుక వర్షాకాలంలో కూల్‌డ్రింక్స్‌ను తాగకపోవడమే మంచిది.
ఇంకా వానాకాలం, చలికాలంలో చేపలు, రొయ్యలు వంటివి తీసుకోకూడదు. ఈ సమయంలో వాటిపై లార్వా, వైరస్‌లు, ఇతర క్రిములు ఎక్కువగా ఉంటాయి. ఇక మార్కెట్‌లో అమ్మే చేపలు, రొయ్యలపై ఈ కాలంలో ఉండే తేమ కారణంగా బాక్టీరియాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఓ పట్టాన పోవు. కనుక ఈ కాలంలో చేపలు, రొయ్యలను తినకుండా ఉంటేనే బెటర్. లేదంటే ఇన్‌ఫెక్షన్ల బారిన పడతారని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.