Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విపక్షం లేకుండానే ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు శుక్రవారం నుంచి 10 రోజుల పాటు జరగనున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ మొదలుకొని ఇప్పటివరకూ ప్రతిపక్ష పార్టీ లేకుండా జరుగుతున్న మొట్ట మొదటి శాసనసభ సమా

Advertiesment
విపక్షం లేకుండానే ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
, శుక్రవారం, 10 నవంబరు 2017 (09:29 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు శుక్రవారం నుంచి 10 రోజుల పాటు జరగనున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ మొదలుకొని ఇప్పటివరకూ ప్రతిపక్ష పార్టీ లేకుండా జరుగుతున్న మొట్ట మొదటి శాసనసభ సమావేశాలు ఇవే కావడం గమనార్హం. అధికార, ప్రతిపక్షపార్టీల మధ్య ఎలాంటి వాగ్వివాదాలు, మాటల యుద్ధం లేకుండా అసెంబ్లీ సమావేశాలు ఏకపక్షంగానే జరుగనున్నాయి.  ఈ సమావేశాల్లో జీఎస్టీ బిల్లు ఆమోదానికి శానసభను నిర్వహించి 15వ తేదీకి ఆరు నెలల కాలం పూర్తవుతున్న క్రమంలో అసెంబ్లీ వ్యవహారాల నియమ నిబంధనల ప్రకారం సభను తప్పక నిర్వహించాల్సి ఉంది. 
 
దీంతో ఏపీ సీఎం చంద్రబాబు సభను నిర్వహించడానికే మొగ్గు చూపారు. ప్రతిపక్షపార్టీకి చెందిన సభ్యులు లేకుండానే అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలు జరిగే అవకాశాలు ఉండటంతో అధికారపార్టీ పలు కీలక బిల్లులను ప్రభుత్వం తక్కువ సమయంలో ఆమోదించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
 
మరోవైపు శీతాకాల సమావేశాల ప్రారంభోత్సవ ఉపన్యాసానికి తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ ఈ.ఎస్‌.ఎల్‌.నరసింహన్‌ హాజరు కావలసిఉంది. అయితే గవర్నర్‌ ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు రావడం లేదు. దీంతో అసెంబ్లీ సమావేశాలు కేవలం అధికార పార్టీతో పాటు దాని మిత్ర పక్షపార్టీ బీజేపీ సభ్యులతో సభ కొనసాగే అవకాశాలున్నాయి. 
 
ప్రతిపక్షాలు లేకపోవడంతో సభకు ఎలాంటి అంతరాయాలు ఉండవని, పూర్తిస్థాయిలో జరుగుతుందని అంటున్నారు. శాసనసభ, మండలిలో ప్రశ్నోత్తరాలను పూర్తిస్థాయిలో సాగేలా చూడాలని అధికార పక్షం నిర్ణయించింది. కాగా, ఈ సమావేశాలను ప్రధాన ప్రతిపక్షమైన వైకాపా బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్న విషయం తెల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

#ITRaid : పిరికిపందను కాను... జైలుకెళ్లడం నాకు అలవాటే : దినకరన్