తేనెలో కాస్త గ్లిజరిన్ కలిపి రాసుకుంటే...
సాధారణంగా చలికాలంలో గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ప్రధానంగా ఎదురయ్యే సమస్యలు చర్మం పొడిబారటం, పగలటం, మంటపెట్టడం, చిటపటలాడటం, దురద పెట్టడం వంటి సమస్యలు తలెత్తుతాయి.
సాధారణంగా చలికాలంలో గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ప్రధానంగా ఎదురయ్యే సమస్యలు చర్మం పొడిబారటం, పగలటం, మంటపెట్టడం, చిటపటలాడటం, దురద పెట్టడం వంటి సమస్యలు తలెత్తుతాయి. పొడిబారిన చర్మం ఉన్న వారికి ఈ సమస్యలు మరింత ఎక్కువగా ఉంటాయి. ఆయిల్ స్కిన్ ఉన్న వారికీ సమస్యలు తప్పవు. అందుకే కొన్ని జాగ్రత్తలు పాటిస్తే చర్మాన్ని చలికాలంలో కాపాడుకోవచ్చు.
చలికాలం పొడవునా వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి వేసవి కాలం తరహాలో నీరు పదేపదే తాగాలనిపించదు. పైగా గాలిలో తేమ తక్కువ కాబట్టి శరీరం నుంచి బయటకు వెళ్లే నీటి శాతం కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది. దీంతో చర్మం మరింతగా పొడిబారి పోవడమూ తప్పదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి అంటే నీరు తాగుతూ పోవడమే.. దీనికి అదనంగా వ్యాయామం చేయడం మర్చిపోవద్దు. చలికాలం రోజుకు కనీసం అర్థగంట పాటైనా వ్యాయామం చేస్తే రక్తప్రసరణ ప్రక్రియ చక్కగా సాగుతుంది. కండరాలు ఉత్తేజితం అవుతాయి కూడా.
స్నానానికి ముందు కొబ్బరి లేదా ఆలివ్ నూనెను ఒంటికి పట్టించి గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే చర్మం పొడిబారదు. అలాగే చెంచా శెనగపిండికి చిటికెడు పసుపూ, అరచెంచా పాలు లేదా పెరుగు కలిపి ముఖం, మెడకు రాసుకుని బాగా మర్దన చేయాలి. ఆ తర్వాత స్నానం చేస్తే ముఖానికి తేమ అందుతుంది.
పెదవులు పొడిబారి పగిలినట్లు ఉంటాయి. తేనెలో కాస్త గ్లిజరిన్ కలిపి రాసుకోవాలి. ఇలా రోజులో 2-3సార్లు చేస్తుంటే పగుళ్ల సమస్య తగ్గి పెదవులు తాజాగా కనిపిస్తాయి. చర్మం పొడిబారినప్పుడు పాదాలు కూడా పగలడం కొందరిలో కనిపిస్తుంది. ఇలాంటివారు టేబుల్‌స్పూను ఆలివ్‌నూనెకు అరచెంచా నిమ్మరసాన్ని కలిపి రాత్రుళ్లు పాదాలకు రాసుకుని సాక్సులు వేసుకోవాలి. ఇలాంటి చిట్కాలు పాటించినట్టయితే చలికాలంలో చర్మాన్ని రక్షించుకోవచ్చు.