Webdunia - Bharat's app for daily news and videos

Install App

పచ్చి టొమాటోలు తినడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటో తెలుసా?

Webdunia
సోమవారం, 31 జనవరి 2022 (23:16 IST)
టొమాటోలు మన ఆరోగ్యానికి చేసే మేలు ఎంతో వుంది. వీటిని కూరలు, సూప్‌లు, సలాడ్‌లు ఇలా.. ఏ వంటలోనైనా టమోటో తప్పనిసరిగా వాడుతుంటారు. ఎక్కువగా బాగా ఎర్రగా పండిన ఎరుపు రంగు టమోటాలు మాత్రమే ఉపయోగిస్తారు.


పచ్చి టమోటాలు తినడం ఆరోగ్యానికి మంచిది కాదనే అపోహ చాలా మందిలో ఉంది. అయితే అది నిజం కాదు. ఎర్ర టొమాటోలే కాదు పచ్చి టమోటాలు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వీటిని తినడం వల్ల కలిగే ప్రయోజనాలు  ఏమిటో తెలుసుకుందాం.

 
పచ్చి టమోటాలలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అంతేకాకుండా ఆరోగ్య సమస్యలు, ఇన్ఫెక్షన్ల నుంచి విముక్తి కల్పిస్తాయి. పచ్చి టమోటాలు కంటికి మేలు చేస్తాయి. ఇందులో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. వీటిని తినడం వల్ల కంటి సమస్యలు తగ్గి కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది.

 
పచ్చి టమోటాలు రక్తపోటును తగ్గించడంలో బాగా సహాయపడుతాయి. అధిక రక్తపోటు ఉన్నవారు పచ్చి టమోటాలు తినడం మంచిది. ఇందులో సోడియం తక్కువగానూ, పొటాషియం ఎక్కువగానూ ఉంటుంది. పచ్చి టొమాటోలు ఆరోగ్యానికే కాదు చర్మానికి కూడా మేలు చేస్తాయి. గ్రీన్ టొమాటోలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మ కణాలను ఏర్పరుస్తుంది మరియు ముడతలను తగ్గిస్తుంది. కనుక పచ్చి టమోటాలను వంటకాల్లో చేర్చుకుంటూ వుండాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

సింగపూర్‌తో వైకాపా తెగతెంపులు.. ఏం జరిగిందో కనుక్కోండి.. బాబు

నవంబర్ 29న ఘనంగా దీక్షా దివస్‌.. కేటీఆర్ పిలుపు

గడ్డం, మీసంతో కనిపించిన అఘోరీ.. చేతిలో నిమ్మకాయలు.. ఏం చేస్తోంది..? (video)

ఆర్టీసీ బస్సు.. చివరి సీటులో యువకుడు ఆత్మహత్య.. కారణం ఏంటి?

గర్భిణులకు ఓవర్ డోస్ యాంటీబయోటిక్స్.. నకిలీ డాక్టర్ అరెస్ట్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సరైన అనుమతులు లేకుండా ఫామ్‌హౌస్‌ నిర్మాణం-నటుడు అలీకి నోటీసులు

పుష్ప-2 రికార్డు బద్ధలు: కిసిక్ సాంగ్‌ రిలీజ్.. ఎప్పుడంటే?

2025లో పెళ్లి పీటలెక్కనున్న తమన్నా- విజయ్ వర్మ?

రంగస్థలం.. గేమ్ ఛేంజర్.. సైకిల్ తొక్కుతున్న చెర్రీ.. టీడీపీ క్యాడర్ హ్యాపీ?

డాకు మహారాజ్ యాభై రోజుల్లో మీముందుకు రాబోతుంది

తర్వాతి కథనం
Show comments