Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జ్వరంతో బాధపడుతున్నప్పుడు చికెన్ తినవచ్చా?

Advertiesment
chicken
, శుక్రవారం, 28 జనవరి 2022 (21:04 IST)
వారం వారం చికెన్ తినేవారు ఏదయినా అనారోగ్య కారణంగా తినడం మానేయాలంటే చాలా కష్టం. చికెన్ తినాలని నాలుక పీకేస్తుంది. ఐతే అసలే ఇప్పుడు కరోనా కాలం, అందులోనూ జ్వరాలు. మరి జ్వరం వస్తే చికెన్ తినవచ్చా లేదా అని చాలామంది డౌట్ పడుతుంటారు. జ్వరంతో బాధపడుతున్నప్పుడు మీరు ఎంచుకోగల ఉత్తమమైన వంటకం చికెన్ సూప్ మాత్రమే.

 
ఈ వేడివేడి సూప్ కాస్తంత ఉపశమనాన్ని ఇస్తుంది. చికెన్‌లోని ప్రోటీన్ కంటెంట్ శరీరాన్ని కోలుకోవడానికి తగినంత శక్తిని ఇస్తుంది. చికెన్ సూప్, ఎలక్ట్రోలైట్‌ల యొక్క అద్భుతమైన మూలం కనుక అది హైడ్రేట్‌గా ఉంచుతుంది. ఈ వేడి ద్రవం దగ్గు, మూసుకుపోయి దిబ్బడ వేసిన ముక్కుకు కారణమయ్యే న్యూట్రోఫిల్స్ చర్యను నిరోధించడం ద్వారా తగ్గించే సహజమైన డీకాంగెస్టెంట్‌గా పనిచేస్తుంది.

 
ఐతే ఏ రకమైన వేయించిన, భారీ చికెన్ వంటకాల జోలికి మాత్రం పోకూడదు. మసాలాలు, నూనె, క్రీమ్ లేదా రిచ్ పదార్థాలతో తయారు చేయబడిన చికెన్ వంటకాలు జ్వరం వున్నప్పుడు తీసుకుంటే అది తగ్గకపోగా సమస్యను మరింత జఠిలం చేస్తుంది. ఇటువంటి ఆహారాలు జీర్ణం కావడం కష్టం. అవి శరీరానికి సహాయపడే బదులు మరింత బలహీనపరుస్తాయి.

 
ఇలా ఇబ్బందిపెట్టే చికెన్ వంటకాల్లో బటర్ చికెన్, చికెన్ మసాలా, చికెన్ లాలిపాప్, చిల్లీ చికెన్, క్రీమ్ చికెన్ తదితర వంటకాలున్నాయి. అలాంటివన్నీ తినకూడదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

థైరాయిడ్ సమస్య ముందస్తు హెచ్చరిక సంకేతాలు ఏమిటి?