Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులో తొలి స్టోర్‌ను ప్రారంభించిన సోచ్‌

Webdunia
శనివారం, 8 అక్టోబరు 2022 (20:58 IST)
కర్నూలు : ఫ్యాషన్‌ ప్రేమికుల ఎథ్నిక్‌ వస్త్రావసరాలను తీర్చడంలో ఏకీకృత కేంద్రంగా నిలిచిన సోచ్‌, కర్నూలు నగరంలో తమ మొట్టమొదటి స్టోర్‌ను  ప్రారంభించింది. ఈ స్టోర్‌ 1068 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. రాష్ట్రంలో తమ కార్యకలాపాలను బలోపేతం చేసుకోవడంలో బ్రాండ్‌ ప్రయత్నాలకు నిదర్శనంగా ఇది నిలుస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో 9 స్టోర్లను సోచ్‌ నిర్వహిస్తుంది. ఈ ప్రాంతంలో వినియోగదారుల నుంచి అపూర్వ ఆదరణను సోచ్‌ పొందుతుంది. ఈ స్టోర్‌ ప్రారంభంతో తమ కార్యకలాపాలను మరింతగా విస్తరించడం సాధ్యమవుతుంది. ఇటీవలనే ఈ బ్రాండ్‌ తమ 150వ స్టోర్‌ ప్రారంభించింది.
 
కర్నూలు స్టోర్‌లో బ్రాండ్‌ తాజా పండుగ కలెక్షన్‌ ప్రదర్శించనున్నారు. ఈ ఎక్స్‌క్లూజివ్‌ కలెక్షన్‌లో ఆర్ట్‌ సిల్క్‌, కాటన్‌, జార్జెట్‌, ఆర్నెట్‌ బ్రొకెడ్స్‌ నుంచి వినియోగదారులు ఎంచుకోవచ్చు. ఈ స్టోర్‌ ప్రారంభం సందర్భంగా వినయ్‌ చట్లానీ, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అండ్‌ సీఈవొ-సోచ్‌ అప్పెరల్స్‌ మాట్లాడుతూ ‘‘కర్నూలులో మా మొట్టమొదటి స్టోర్‌ను ప్రారంభించడం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము. తద్వారా ఆంధ్రప్రదేశ్‌లో మా చేరికను విస్తరించాం. ఈ ప్రాంతంలోని మా వినియోగదారులకు మా నూతన కలెక్షన్‌ మొదలు అపారమైన అవకాశాలను సైతం అందించనున్నాం. అసలైన సోచ్‌ అనుభవాలను ఈ స్టోర్‌ అందించనుంది’’ అని అన్నారు.
 
దేశంలో సోచ్‌ గత 16 సంవత్సరాలుగా తమ కార్యకలాపాలను నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా60 నగరాలలో 151 స్టోర్లు సోచ్‌కు ఉన్నాయి. వీటితో పాటుగా సోచ్‌ ఇప్పుడు సెంట్రల్‌వద్ద షాప్‌ ఇన్‌ షాప్స్‌ నిర్వహిస్తుండటంతో పాటుగా తమ సొంత వెబ్‌సైట్‌ సోచ్‌ డాట్‌ కామ్‌, ఈ-కామర్స్‌ పోర్టల్స్‌ అయిన అమెజాన్‌, మింత్రా, ఫ్లిప్‌కార్ట్‌, టాటా క్లిక్‌, అజియో, న్యాకా వంటి వాటి వద్ద కూడా లభ్యమవుతుంది. ప్రధాన మెట్రో నగరాలతో పాటుగా టియర్‌ 2 పట్టణాలలో సైతం విస్తరించేందుకు ప్రణాళిక చేసింది సోచ్‌. దక్షిణ మరియు పశ్చిమ భారతదేశంలో విస్తృతమైన సోచ్‌ ఇప్పుడు ఉత్తర, తూర్పు భారతదేశాలలో తమ ఉనికిని బలంగా చాటడానికి ప్రయత్నిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఏపీ లిక్కర్ కేసు: సిట్ విచారణకు హాజరైన వైసీపీ నేత మిథున్ రెడ్డి

తండ్రి మృతదేహం ముందే ప్రియురాలి మెడలో తాళి కట్టిన కుమారుడు (వీడియో)

కాలేజీ బిల్డింగ్ మీద నుంచి దూకేసిన విద్యార్థిని.. కారణం ఏంటి? (Video)

కాల్పుల ఘటన: కెనడాకు వెళ్లిన భారతీయ విద్యార్థిని మృతి

వందలాది మంది అంతర్జాతీయ విద్యార్థుల విద్యా వీసాలు రద్దు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

తర్వాతి కథనం
Show comments